కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం సానుకూలత

బాలశౌరి ప్రశ్నకు స్పందించిన మంత్రి

న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): కడప జిల్లాలో డిసెంబర్‌ మాసంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని.. దీనికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సానుకూలంగా స్పందించటం సంతోషమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బలశౌరి అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఎంపీ సోమవారం లోక్‌సభలో కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు గురించి ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి స్పదిస్తూ.. కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయడానికి అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. ముడి ఇనుము దీర్ఘకాలికంగా సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంటామని పేర్కొన్నారు. త్వరలో కడపలో ఏర్పాటు కాబోయే స్టీల్‌ ప్లాంట్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని ఎంపీ బాలశౌరి కోరారు. జస్టిస్‌ ఫర్‌ దిశ అత్యాచార ఘటన అందరిని తలదించుకునేలా ఉందన్నారు. ఆ ఘటనకు పాల్పడిన మానవ మృగాలను శిక్షించటంలో ఆలస్యం చేయవద్దని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేలా కఠిన శిక్షలు విధించాలని ఎంపీ తెలిపారు. అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకురావాలన్నారు. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ చిల్లర పనులు మానుకోవాలని ఎంపీ హెచ్చరించారు. తిరుపతి వెబ్‌సైట్‌లో లేనిపోని అంశాలను వారే సృష్టించి అన్యమత ప్రచారం పేరిట దుష్పచ్రారనికి దిగుతున్నారని ఎంపీ బాలశౌరి మండిపడ్డారు.