కరీంనగర్‌లో భారీ వర్షాలు

కరీంనగర్ : జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మహదేవ్‌పూర్ మండలం పెద్దంపేట, పంకెన, సర్వాయిపేట వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతంలోని 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రామగుండం రీజియన్‌లోని సింగరేణి-4 ఓపెన్ కాస్ట్ బొగ్గుగనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది.