కరోనా మృతుల్లో పురుషులే  ఎక్కువ`

27 మంది పురుషు,7 మహిళు మృత్యువాత`

తెంగాణలో కొత్తగా 47 కేసు

హైదరాబాద్‌,మే 14(జనంసాక్షి):మొత్తంగా నమోదైన మృతుల్లో 27 మంది పురుషు కాగా ఏడుగురు మహిళు ప్రాణాు కోల్పోయారు. ఇతర ప్రాంతా నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వారికి విమానాశ్రయాు, రైల్వేస్టేషన్లలోనే కరోనా పరీక్షు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది తెంగాణలో ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. నమోదైనవాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 కేసు, రంగారెడ్డి జల్లాలో 2, మరో ఇద్దరు వస కార్మికుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసుతో కలిపి ఇప్పటివరకు కరోనాబారిన పడిన వస కూలీ సంఖ్య 37కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసు 1,414కి చేరాయి. తాజాగా 13 మంది బాధితు కోుకుని డిశ్చార్జ్‌ కాగా.. మొత్తంగా 952 మంది కోుకున్నారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి 34 మంది ప్రాణాు కోల్పోయినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 428 మంది బాధితు చికిత్స పొందుతున్నారు.రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల్లో పురుషుతో పోల్చితే మహిళు తక్కువగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. తెంగాణలో ఇప్పటివరకు యాదాద్రి`భువనగిరి, వరంగల్‌ రూరల్‌, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వ్లెడిరచింది. గత 14 రోజుగా రాష్ట్రంలోని కరీంనగర్‌, రాజన్న సిరిస్లి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, జయశంకర్‌ భూపాపల్లి, సంగారెడ్డి, జగిత్యా, నాగర్‌కర్నూల్‌, ముగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యా, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్‌, వికారాబాద్‌, నల్గొండ, కుమరంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, జనగామ, జోగులాంబ గద్వా, నిర్మల్‌ జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.