కర్ణాటకలో సందిగ్ధత..

– నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌లు 
ముంబయి, మే16(జ‌నం సాక్షి) : మంగళవారం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భాజపా ఆధిక్యంలో ఉన్నప్పుడు లాభాల్లో పరుగులు పెట్టిన సూచీలు.. హంగ్‌ ఏర్పడడంతో చివరకు నష్టాలపాలయ్యాయి. బుధవారం కూడా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టత లేకపోవడంతో నష్టాలు కొనసాగాయి. ఉదయం దాదాపు 166 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ నష్టాల్లోనే కొనసాగుతూ వచ్చింది. నిఫ్టీ కూడా 54 పాయింట్ల నష్టంతో ప్రారంభమై చివరి వరకు నష్టాలనే చవిచూసింది. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 156.06 పాయింట్లు నష్టపోయి 35,387.88 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 60.80 పాయింట్లు నష్టపోయి 10741.10 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం ట్రేడింగ్‌లో హెచ్‌యూఎల్‌, లుపిన్‌, ఐటీసీ, విప్రో, ఎస్‌ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంకు, అల్టాట్రెక్‌ సిమెంట్‌, సిఎ/-లా, గెయిల్‌, రిలయన్స్‌ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. పీఎన్‌బీ, సిండికేట్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సెంచురీ ప్లేబోర్డ్స్‌, మోరెపెన్‌ ల్యాబ్స్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, శక్తి పంప్స్‌ కంపెనీల షేరు?లు దాదాపు 16శాతం పడిపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.82 వద్ద ట్రేడవుతోంది.
———————————-