కలెక్టర్లు మారిన విద్యార్థుల కష్టాలు మారకపాయే.

★3సంవత్సరాలుగా ఐదు తరగతులకు ఒకే టీచర్ బోధన.
★పట్టించుకోని సంబంధిత ప్రభుత్వ అధికారులు
★కుంటునబడుతున్న కల్వరాల్ ప్రాథమిక పాఠశాల.
★దీంతో ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గుచూపుతున్న తల్లిదండ్రులు.
★ఆయాగ్రామాల్లో ప్రశ్నార్ధకంగ మిగిలిన బీద,
మధ్యతరగతి పిల్లల భవిష్యత్తు.
★ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అంటున్న పిల్లల తల్లిదండ్రులు.
సదాశివనగర్ న్యూస్:ఆగస్టు12(జనంసాక్షి)పిల్లల భవిష్యత్తు ఉన్నత స్థాయి వరకు చేరుకొని సమాజంలో మంచి మార్పులు చెయ్యడానికి బాల్యంలో విద్యా విధానం చాలా అవసరం అలాంటి గొప్పదైన విద్య,మండలంలోని కల్వరాల్ గ్రామంలో కనుమరుగై మధ్యతరగతి పిల్లల జీవితాల పై కాటేస్తుందని ఆ గ్రామయువకులు తెలిపారు.గ్రామంలోని(అయిదు తరగతులైన)ప్రాథమిక పాఠశాలను సరిపడ టీచర్లు లేక  మూడు సంవత్సరాలుగా ఒకే  ప్రధానోపాధ్యాయుడు ఇబ్బందికరమైన పరిస్తితుల నడుమ పాఠశాలలను కొనసాగిస్తున్నాడు.ఒకే టీచర్ ఐదు క్లాస్ ల పిల్లలకు ఎలా విద్యాబోధన చేయగలడు అని మండలం నుండి జిల్లా వరకు సంబంధించిన ఏ అధికారులయిన కొంచెం ఆలోచన చేస్తున్నారా అని జనంసాక్షి విలేఖరికి పిల్లల తల్లిదండ్రులు వారి ఆవేదనను వ్యక్తపరిచారు.మూడు సంవత్సరాలుగ పాటశాలలో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులను ఏ ఒక్క అధికారి పట్టించుకోకుండా గాలికి వదిలేసారన్నారు,ఈ సమస్యపై సమగ్రంగా పై అధికారులతో చర్చలు జరిపి ఉపాద్యాయులను తెచ్చే అధికారం ఉన్న మండల విద్యాధికారి కూడా ఒక్కసారి కల్వరాల్ పాఠశాలపై దృష్టి పెట్టకుండా మూడు సంవత్సరాలుగా మండలంలో ఎలాంటి విద్యా విధులు నిర్వర్తిస్తున్నాడో భగవంతునికె తెలియాలని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితులనడుమ గ్రామంలో ఉన్న ధనవంతులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్ లకు పంపుతున్నారు.సుమారు 50 నుండి 100 మంది పిల్లలు పక్కఊరులో ఉన్న ప్రైవేట్ పాఠశాలకు వెళుతున్నారు.అదే గ్రామంలోని బీద,మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు వారి పిల్లలను కూడా ప్రైవేట్ స్కూల్ లకు పంపుదామని అనుకుంటే ప్రైవేట్ పాఠశాల ఫిజులు ఆకాశాన్ని తాకేలా అత్యధికంగా ఉండటంతో అటు పంపలేక ఇటు టీచర్లు లేని ప్రభుత్వ పాఠశాలకు పంపలేక మధ్యలో పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.బీద పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలుతుందని దీనిపై జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా దృష్టిసారించి కల్వరాల్ ప్రాథమిక పాఠశాలకి రావాలన్నారు.ఇక్కడ సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి పాఠశాలకు ప్రభుత్వ టీచర్లు మంజూరయ్యేలా చర్యలు జరిపి పిల్లల భవిష్యత్తు కాపాడాలని జిల్లా పాలనధికారిని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
(Note..సంతోష్ ప్రధానోపాధ్యాయులు voice)మూడు సంవత్సరాలుగా సరిపడా టీచర్లు లేక నేను మరియు పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.ఈ విషయం పలు మార్లు మండల,జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను,వారు పై అధికారులు నుండి స్పందన లేనప్పుడు మేము ఏమి చేయలేమన్నారు.ప్రభుత్వం ఎప్పుడు టీచర్లను మంజూరు చేస్తే ముందుగా కల్వరాల్ పాఠశాలకె ఇస్తామన్నారు.గత సంవత్సరం మా పాఠశాల నుండి 13 మంది విద్యార్థుల్లో 10 మంది మాడల్ స్కూలుకు ఎంపిక అయ్యారు.ఇప్పటికైనా కల్వరాల్ పాఠశాలపై ప్రభుత్వం దృష్టి సారించి ప్రభుత్వ టీచర్లను మంజూరు చేయాలన్నారు.
(Note..విజయలక్ష్మి పేరెంట్ voice) ప్రభుత్వ బడులలో వసతులు ఎలా ఉన్నాయి, అక్కడ చదువుతున్న పిల్లలకు బోధన సరిగ్గా ఉన్నదా లేదా అనే విషయాలను ఏ ఒక్క ప్రభుత్వ అధికారి పట్టించుకోలేరు,ఒకే ఒక్క టీచర్ మూడు సంవత్సరాలగా 5 తరగతులకు పాఠాలు బోధన చేస్తున్నాడు.ఇప్పటికైనా పిల్లల భవిష్యత్తు గురించి సంబంధిత అధికారులు మరియు జిల్లా పాలనధికారి స్పందించి పాఠశాలకు సరిపడా టీచర్లను ఇవ్వాలి.