కళాకారులకు అండగా ప్రభుత్వం

చిందు సంక్షేమ భవన్‌కు మంత్రి శంకుస్థాపన

నిర్మల్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): సమాజాన్ని చైతన్యపరచడంలో కళాకారుల పాత్ర గొప్పదని, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సారంగాపూర్‌ మండలం శ్యాంఘడ్‌ లో చిందు కళాకారుల సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి

ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ… కళలకు కాణాచి అయిన తెలంగాణలో చిందు కళాకారుల పాత్ర ఎంతో విశిష్టమైందన్నారు. తరతరాలుగా కళామతల్లి సేవచేస్తూ ఉత్తర తెలంగాణకు వన్నె తెచ్చిన చరిత్ర చిందు కళాకారులదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిందు కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో చిందు కళాకారులకు తగిన వాటా దక్కేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు.