కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలి

–  జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కస్టమర్ లకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెడరల్ బ్యాంకు ను మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు.సాంకేతిక పరిజ్ఞానంఅభివృద్ధి చెందడంతో ఆన్ లైన్, డిజిటల్ బ్యాంకింగ్ కు ప్రాధాన్యత ఏర్పడిందని అన్నారు.మొబైల్ బ్యాంకింగ్ లో కస్టమర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.అనంతరం ఫెడరల్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజిత్ కుమార్ మాట్లాడుతూ తమ బ్యాంకులో  బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డికి రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు.అన్ని రకాల బ్యాంకింగ్ సేవలతో పాటు వ్యవసాయ రుణాలు ఇస్తామని తెలిపారు.డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ దిలీప్, రీజనల్ హెడ్ ప్రమోద్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ కొత్త శ్రీనివాస రావు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.