కాంగ్రెస్‌ కూటమి ఎత్తులు ఫలించవు

కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారో ప్రజలకు వివరించండి

ప్రజలు వారిని ఓడించేందుకు సిద్దంగా ఉన్నారు: సోమారపు

గోదావరిఖని,నవంబర్‌20(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమి కట్టినా, ఎత్తులు వేసినా ప్రజలు ఎన్నికల్లో వారిని చిత్తుచేయబోతున్నారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. పదేళ్లపాటు పాలన చ ఏసిన కాలంలో ఏ సమస్యా తీర్చలేని వారు ఇప్పుడు కొత్త వేశం కట్టుకుని వస్తున్నారని ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్‌ చెప్పినట్లు ఆ పదేళ్ల కాలంలో ఎందుకు కరెంట్‌,నీళ్లు ఇవ్వలేకపోయారో ముందుగా ప్రజలకు బహిరంగ వివరణ ఇవ్వాలని సవాల్‌ చేశారు. ఇప్పుడు ఏవేవో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేదరని అన్నారు. నాలుగేళ్ల తెలంగాణ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మోసపూరిత నాయకులు వస్తున్నారనీ, నేర చరిత కలిగిన వారంతా జత కడుతున్నారనీ, అలాంటి వారికి అధికారం ఇస్తే అభివృద్ధిలో మళ్లీ వెనక్కిపోక తప్పదని వివరించారు. తాను మొదటి నుంచి నిజాయతీగా, నిబద్ధతతో ఏలాంటి ఆరోపణలకు తావు లేకుండా సేవ చేస్తున్నానని తెలిపారు. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తన ఆకాంక్షను గుర్తించి ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రెండింతల అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాను అధికారంలో ఉన్న కాలంలో ఏ ఒక్క వ్యాపారిని ఏలాంటి చందా కూడా అడగలేదనీ, నిస్వార్థంగా వారి ఎదుగుదల కోసం కృషి చేశానని వివరించారు. దీంతో వ్యాపారులంతా తనకు మొదటి నుంచి వెన్నంటి ఉంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటెయ్యాలని టీఆర్‌ఎస్‌ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. నిజాయతీకి మారుపేరుగా, రామగుండం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న తనను మరోసారి ఆశ్వీరదించాలన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన డివిజన్‌ వాసులకు అండగా నిలబడతాన్నారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని సత్యనారాయణ సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్‌ను గెలిపించుకోవాలన్నారు.

రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.