కాంగ్రెస్‌ మరింత పతనం కావడం ఖాయం

తెలంగాణలో ఇక టిఆర్‌ఎస్‌దే మల్లీ అధికారం: ఎమ్మెల్యే

సిద్దిపేట,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రైతుల శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేసి ముందుకు వెళుతోందని అభిప్రాయపడ్డారు. ఎకరానికి రూ.8వేలు పెట్టుబడిగా రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టుబడిగా అందజేయడం దేశంలో ఎక్కడైనా ఉందా అని అన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్‌ను ఆదరిస్తుంటే కాంగ్రెస్‌ శాపనార్తాలు పెడుతోందన్నారు. ప్రగతినివేదన సభతో వణుకు పుట్టిందని, ఇక ఆశీర్వాద సభతో కాంగ్రెస్‌కు పతనం మొదలయినట్లేనని అన్నారు. అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకోవాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని వివరించారు. అందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో మొదటిసారిగా రైతులను సంఘటితం చేసేందకు తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. అన్ని వర్గాల రైతులకు కమిటీలో స్థానం ఉంటుందని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు అందుటులోకి తెచ్చిందన్నారు. రైతు రుణ మాఫీ కూడా అమలు చేసిందన్నారు. వ్యవసాయానికి 24గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తుందని అన్నారు. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం కోసం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తుందన్నారు. సీఎం కావాలన్న ఆశతో డజను మంది కాంగ్రెస్‌ నేతలు పగటికలలు కంటున్నారని ఎద్దేవాచేశారు. ప్రగతి నివేదన సభ విజయవంతంతో కాంగ్రెస్‌ నేతలు డంగైపోయి విమర్శులు చేస్తున్నారని అన్నారు. నాలుగున్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని నివేదించేందుకు సభ నిర్వహించామని, ఎవరినో తిట్టడానికి కాదన్నారు. నాలుగేండ్లలో తెలంగాణలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలిచిందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతోనే విజయం

సాధ్యమైందని చెప్పారు.