కాంగ్రెస్  గడప గడపకు ప్రచారం

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 24)

సోమవారం సిద్దిపేట పట్టణంలోని 8వ వార్డుల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. దీంతో కాలనీల మహిళలు ప్రభాకర్ వర్మకు మంగళహారతులనిచ్చి తిలకం దిద్దారు. ఈ సందర్భంగా ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలోపలు వార్డులలో ప్రచార కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని చెప్పారు. వార్డుల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు కాంగ్రెస్ కు ఓటేస్తామని స్వచ్చందంగా తెలుపుతున్నారన్నారు. తెలంగాణ ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, మరోసారి ఎన్నికల పేరుతో మాయమాటలు చెప్పి మోసగించేందుకు కేసీఆర్ వస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియమకాల కోసం తెలంగాణ కోసం పోరాడితే, అధికారంలోకి రాగానే  వాటిని విస్మరించి తెలంగాణ ప్రజలను యువతీ యువకులను కేసీఆర్ మోసగించారన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నాలుగున్నారేళ్లు కేసీఆర్ కాలయాపన చేశారని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు అని చెప్పి నేటికి రాష్ట్రమంతటా ఎక్కడా పూర్తిచేయలేదని చెప్పారు.  గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పథకాలకు పెరు మార్చాడే తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ నాయకత్వలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలుచేసి చూపిస్తామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లుతుందన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకొని ఓటు వేయాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎంచుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తు ఇమాం డీసీసీ మైనార్టీ కన్వీనర్ మొయినుద్దీన్ జిల్లా వికలాంగుల విభాగ చైర్మన్ జౌనరమేష్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్  శబుద్దిన్  అధ్యక్షుడు కొలను నరేష్  టౌన్ కాంగ్రెస్ సెక్రటరీ మోతె కుమార్ కుమార్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సీతా బాలు కుమార్ ప్యాయజ్  తదితరులు పాల్గొన్నారు