కారు…జోరు..!

★ప్రచారం వేగం పెంచిన తెరాస
★కామారెడ్డి, బాన్సువాడ,ఎల్లారెడ్డిలో దూసుకుపోతున్న గులాబీ అభ్యర్థులు
★గెలుపే లక్ష్యంగా ప్రతి ఓటరును కలుస్తూ ముందుకు…
★అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రెండోదశ ప్రచారానికి శ్రీకారం
ఎల్లారెడ్డి-అక్టోబర్-11(జనంసాక్షి)
ఎల్లారెడ్డి:మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో టిఆర్ ఎస్ అభ్యర్థులు ప్రచారం వేగం పెంచారు.ప్రతిపక్షాల కంటే ముందుకు దూసుకెళ్తున్నరు.గడపగడపకు వెళ్లి ప్రతిఒటరును కలుస్తూ తమకు ఓటయ్యాలని అభ్యర్థిస్తున్నారు.ప్రధానంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గులాబీ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో ముందున్నారు.తమ పార్టీ నేత ఆదేశాల మేరకు మొదటి దశ ప్రచారం పూర్తి చేసి, రెండోదశకు సిద్దమవుతున్నారు.జిల్లాలో తెరాస అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి మరింత పడునుబెట్టారు.ఎన్నికలకు రెండు నెలలు గడువుఉండడంతో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతిగడపకు ఓటరు తట్టే దిశగా ముందుకు సాగుతున్నారు.అంటే కాకుండా వీలైనంత త్వరగా మొదటి దశ ప్రచారం పూర్తి చేసి, రెండోదశ మొదలు పెట్టాలని అధినేత నుంచి ఆదేశాల మేరకు అభ్యర్థులు మరింతగా దూకుడుపెంచారు.గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను ఒడ్డుతున్నారు.ఈ నాలుగేళ్ళలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రత్యర్ధులపై,పైచేయి సాధించే విదంగా వలసలను ప్రోత్సహిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లోగెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్నరు.గత నెల 6న ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభను రద్దు చేసిన వెంటనే అభ్యర్థులను ప్రకటించారు.సిట్టింగ్ లకె సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే,దింతో ఎల్లారెడ్డి నియోజకవర్గం తో పాటు జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాలో అభ్యర్థులు ప్రచారని ముమ్మరం చేశారు.ఎన్నికల ప్రచారానికి తోడు పనిలో పనిగా తెరాస అభ్యర్థులు వలసలు ప్రోత్సహిస్తు వందలాది మందికి  టిఆర్ ఎస్ కండువాలు కప్పుతున్నారు.అసంతృప్తివాదులను కలుపుకుంటూ వారిని బుజ్జగించి తమ వైపు తిప్పుకుంటున్నారు.అసెంబ్లీ రద్దు ముందే ఆయా నియోజకవర్గల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ నెల 3న నిజామాబాద్ లో నిర్వహించిన ఆశీర్వాద సభలో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది.ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రచారానికి మరింత సమయంలభించినట్లైంది.ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తాము వ్యక్తి గతంగా చేసిన పనులను వివరిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
★ఎల్లారెడ్డిలో…
తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తమ మార్క్ ప్రచారం కొనసాగిస్తున్నారు.అభ్యర్థులను ఖరారైన నాటి నుంచి గ్రామాల్లో పర్యటిస్తూ అందరిని ఏకతాటిపైకి తేవడంతో సఫలీకృతమవుతున్నారు.ప్రధానంగా గ్రామసభలు నిర్వహిస్తూ చేసిన అభివృద్ధిని చెపుతున్నారు.మండలస్థాయి పార్టీ నాయకులు,అన్ని వర్గాలకు చెందిన వారితో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ,మహాకూటమి ఇంకా తేలలేదు.అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి పార్టీ ఇంచార్జి నల్లమడుగు సురేందర్,బీజేపీ నుంచి ఇప్పటి ఎమ్మెల్యేఅభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి,కావున నియోజకవర్గంలో తెరాస, కాంగ్రెస్  బహుముఖ పోటీ తప్పేలా లేదు.జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాయిస్తున్నారు.