కార్డన్ అండ్ సర్చ్

కూసూమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో పోలీసులు నిర్భంధ తనిఖీ లు ప్రతి ఇంట్లో అణు వణువూ శోధిస్తున్నా పోలీసు సింబ్బంది
కూసుమంచి 24 జూలై (జనంసాక్షీ):  మండల కేంద్ర పరిదిలో  .మల్లేపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున. 6గంట ల నుండి పోలీసులు తనిఖీలు. ప్రారంభించారు. ఖమ్మం రూరల్ ఏసిపి నరేష్ రెడ్డి  ఆద్వర్యంలో కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహిస్తున్న   పోలీసుల…..గ్రామంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ  వివరాలు సేకరిస్తున్న పోలీసులు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు , గుర్తింపు కార్డులను  పరిశీలిస్తున్న సిఐలు తిరుపతి రెడ్డి, వసంత్ కుమార్, సాంబరాజు,  ఎస్ఐలు, పోలీసు సిబ్బంది. ఈ సంధర్భంగా ఖమ్మం రూరల్  ఏసిపి మాట్లాడుతూ … రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ఈ గ్రామంలో   ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూడకుండా  రాజకీయ వర్గ విభేదాలు తావులేకుండా  కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ  కుటుంబ సభ్యుల్లాగా  సమస్యలను సమన్వయంతో  గ్రామ పరిధిలోనే  పరిష్కరించుకుంటే  శాంతి భద్రతల సమస్య తలెత్తదని అన్నారు. కేసులు కోర్టులు అంటూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని  సూచించారు. కుటుంబ పంచాయతీలు, భార్యాభర్తల సమస్యలు, రైతుల గట్టు పంచాయతీలు ఇలాంటి చిన్నచిన్న సమస్యలను  రాజకీయాలకు అతీతంగా పరిష్కారం చూపే జీవన విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు.కొంతమంది తన స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామాల్లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి సురేష్ కుమార్ పర్యవేక్షణలో గ్రామాల ప్రజలు సురక్షితంగా ఉండేందుకు అదేవిధంగా  నేరాల  నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు .అపరిచిత వ్యక్తులు , అనుమానితులు  ఎవరైనా గ్రామాల్లో సంచరిస్తే స్థానిక పోలీసులు గాని డయల్ 100కు సమాచారం అందించాలని ఏసిపి కోరారు .             మొత్తం  291 ఇండ్లను తనిఖీ  చెేశారు. సరియైన పత్రాలు లేని  27 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలు, 1 ట్రాక్టర్ , 94 క్వార్టర్ మద్యం సీసాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు .
తనిఖీల్లో 4 CI’s, 8 SI’s, 05 ASI’s, 09 HC’s, 55 PC’s and 3 HG’s పాల్గొన్నారు .