కార్మికుల జనజాగరణ నిరసన

కనీస వేతనాల కోసం డిమాండ్‌

సూర్యాపేట,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): హుజూర్నగర్‌ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఖండిస్తూ సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులు పెద్ద ఎత్తున రోడ్లపై బైఠాయించి జనజాగరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా పక్కన పెట్టి కార్మికుల జీవితాల తో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. అలాగే కనీస వేతనం ప్ధదెపద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని సంక్షేమ పథకాలు దారి మళ్లించొద్దని కార్మికుల నిధులను కార్మికులకే ఖర్చు చేయాలని అన్నారు. మెప్మా కార్మికులను రెగ్యులర్‌ చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులను పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం ఇచ్చి సమ్మెను విరమింపచేయాలని అన్నారు. గ్రామాలలో పారిశుధ్యలోపం వల్ల రోగాలు వ్యాపిస్తున్నాయని కార్మికులు వాపోయారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత పెద్దనోట్ల రద్దు జీఎస్టీల వల్ల కొన్ని పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. సిమెంట్‌ పరిశ్రమల విూద అజమాయిషీ లేక విపరీతంగా రేట్లు పెరగటం వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి శీతల రోశపతి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యలక సోమయ్యగౌడ్‌ అన్నారు.