కాశ్మీర్‌లో పరిస్థితులపై రాజకీయ పార్టీల పరిశీలన

ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల విముఖత

సంకీర్ణ ప్రభుత్వంతో కాశ్మీర్‌ గాయపడిందన్న ఆజాద్‌

తోణం గవర్నర్‌ పాలన విధించాలన్న ఒమర్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి ): కశ్మీర్‌లో భాజపాాపీడీపీ పొత్తుకు తెరపడడం,సంకీర్ణ ప్రభుత్వానికి భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో ఉత్పతన్న మైన పరిస్తితులను విపక్ష పార్టీలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులను అటు కాంగ్రెస్‌ నిశితంగా పరిశీలిస్తోంది. తాజా పరిస్థితులపై ఆ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీడీపీకి మద్దతిచ్చే ప్రసక్తి లేదని అటు కాంగ్రెస్‌ కూడా తేల్చి చెప్పింది. జమ్ముకశ్మీర్‌లో జరిగిన పరిణామాలు మంచివేనని ఆజాద్‌ పేర్కొన్నారు. పీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పీడీపీాభాజపా సంకీర్ణానికి తెరపడటంతో జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. మూడేళ్ల పాలనలో చాలా మంది పౌరులు, సైనికులు మృతి చెందారని వివరించారు. ఈ కూటమి రాష్టాన్ని ఆర్థికంగా, సామాజికంగా నాశనం చేసిందని మండిపడ్డారు. పీడీపీతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే హిమాలయాలంత తప్పు చేస్తున్నారని తాను గతంలోనే ప్రధాని నరేంద్రమోదీకి చెప్పినట్లు ఆజాద్‌ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నిజమయ్యాయని అన్నారు.జరిగిందంతా మంచికే అనుకోవాలని ఆయన పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌ ప్రజలకు ఉపశమనం లభించిందని గులాం నబీ చెప్పారు. కశ్మీర్‌ ను బిజెపి నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల కాలంలో ఎంతో మంది ప్రజలు, జవాన్లు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిడిపితో కాంగ్రెస్‌ పొత్తు కుదుర్చుకుంటుందా? అనే ప్రశ్నకు సమాధానంగా గులాం నబీ అజాద్‌ ఆ ప్రసక్తే లేదన్నారు.నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వొహ్రాను కలిశారు. అనంతరం విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిణామాలకు పీడీపీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి మెజార్టీ లేదన్నారు. ఏ పార్టీకి తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము ఎవరినీ కలవలేదని.. అలాగే తమను కూడా ఏ పార్టీ సంప్రదించలేదని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. ఎక్కువ కాలం గవర్నర్‌ పాలన కొనసాగించరాదని కూడా సూచించామని చెప్పారు. పీడీపీ-భాజపా పొత్తు వీగిపోవడంపై తాము సంబరాలు చేసుకోవడం లేదని.. నిజానికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీకి గురైందని.. అందుకు బాధపడుతున్నామని తెలిపారు. 2014లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమ పార్టీకి ఎలాంటి ఆదేశాలు, సూచనలు రాలేదని ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై తమను ఎవరూ సంప్రదించడం కానీ, తాము ఎవరినీ కలవడం కానీ జరుగలేదన్నారు. 2018లో కూడా ఇదే పునరావృతం అవుతుందని చెప్పామన్నారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరినట్లు ఒమర్‌ చెప్పారు. ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన కొనసాగించరాదని కోరామన్నారు. శాసనసభను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరుతున్నట్లు చెప్పారు. భాజపా మంత్రులు దిల్లీలో పార్టీ అధినేత అమిత్‌షాతో సమావేశమయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని భాజపాజనరల్‌ సెక్రటరీ రామ్‌మాధవ్‌ ప్రకటించారు.

గవర్నర్‌ పాలన తప్పదేమో

జమ్ముకశ్మీర్‌లో పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రం గవర్నర్‌ పాలనలోకి వెళ్లకుండా ఉండాలంటే అసెంబ్లీ మెజారిటీకి సరికొత్త సంకీర్ణం అవసరమౌతోంది. గవర్నర్‌ పాలనను తప్పించుకోవాలంటే పీడీపీ(పీపుల్స్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌), ఎన్‌సీ(నేషనల్‌ కాంగ్రెస్‌) పొత్తే తక్షణ పరిష్కారంగా అగుపిస్తోంది. గతానుభవాల దృష్ట్యా మోహబూబా ముఫ్తీ, ఫరూక్‌ అబ్దుల్లా ఏ మేరకు కలిసి వెళ్తారనేది వేచి చూడాల్సిన అంశమే. గతంలో జమ్ముకశ్మీర్‌ ఏడుసార్లు రాష్ట్రపతి పాలనను ఎదుర్కొంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే ఇది ఎనిమిదవసారి అవనుంది. సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైన క్రమంలో జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన వివరాలిలా ఉన్నాయి. 26 మార్చి, 1977 నుంచి 9 జులై, 1977.. 105 రోజుల పాటు.. కాంగ్రెస్‌ పార్టీ తన మద్దతు ఉపసహరించుకోవడంతో షేక్‌ అబ్దుల్లానేతృత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. 6 మార్చి, 1986 నుంచి 7 నవంబర్‌, 1986.. 246 రోజులు.. శాసనసభలో బలనిరూపణలో విఫలమైన కారణంగా 19 జనవరి, 1990 నుంచి 9 అక్టోబర్‌,1996.. శాంతి భద్రతలు క్షీణించిన కారణంగా ఆరు సంవత్సరాల 264 రోజుల పాటు..18 అక్టోబర్‌,2002 నుంచి 2 నవంబర్‌, 2002.. రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో నిర్ణయం తీసుకోని కారణంగా 15 రోజుల పాటు 11 జులై, 2008 నుంచి 5 జనవరి, 2009.. 178 రోజుల పాటు.. అమర్‌నాథ్‌ యాత్రికుల సౌకర్యార్థం భూ బదాలింపు విషయంలో సీఎం గులాం నబీ ఆజాద్‌ తీసుకున్న నిర్ణయంతో పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. జనవరి, 2015 నుంచి 1 మార్చి, 2015.. 51 రోజుల పాటు.. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ, పీడీపీలు అవగాహనకు రావడంలో విఫలమైన కారణంగా గవర్నర్‌ పాలనను విధించారు.