కాశ్మీర్‌ పోలీసులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు

– కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌

శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌లోని పోలీసుల రక్షణ కోసం త్వరలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఆదివారం ఆయన అనంత్‌నాగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాల కొనుగోలుకు కేంద్రం నిధులను మంజూరు చేసిందని వెల్లడించారు. దీంతోపాటు పోలీసు సిబ్బంది కోసం ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు నిధులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన ఏఎస్‌ఐ అబ్దుల్‌ రషీద్‌, కానిస్టేబుల్‌ ఇంతియాజ్‌కు రాజ్‌నాథ్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కశ్మీర్‌ కోసం వారు ప్రాణ త్యాగం చేశారు. పోలీస్‌ సిబ్బందిని చూస్తుంటే గర్వంగా ఉంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా విూరు విూ విధులను నిర్వర్తిస్తున్నారు. విూ ధైర్య సాహసాలను కొనియాడేందుకు మాటలు రావడం లేదు. ప్రధాని నరేంద్రమోదీ కూడా విూ ధైర్యాన్ని ప్రశంసించారు’ అని ఆయన అన్నారు. అనంతరం సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రతాపరమైన అంశాలపై చర్చించారు.