కూరగాయల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

ఆదిలాబాద్‌,మే15(జ‌నం సాక్షి):  జిల్లాలో కూరగాయల పంటల సాగుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ను మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. జిల్లాకు మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు సరఫరా అవుతాయని, ఇక నుంచి జిల్లాలోని ప్రజలు వినియోగించే కూరగాయలను ఇక్కడే పండించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు కూరగాయల వినియోగంలో సర్వే నిర్వహించి ప్రణాళికలు తయారుచేసి తనకు అందజేయాలని కోరారు. వీటి ఆధారంగా జిల్లాలోని రైతులకు కూరగాయల సాగుకు అవసరమైన సాయాన్ని అందజేస్తామని తెలిపారు. సాగుకు అవసరమైన విత్తనాలు, పాలీహౌస్‌లు, స్పింక్లర్లు, ఇతర పరికరాలను అందజేస్తామన్నారు. రైతులు లాభాలు వచ్చే పంటలను మాత్రమే పండించాలని మంత్రి సూచించారు. కూరగాయల సాగుతో లాభాలు పండించాలని అన్నారు.