కూరగాయల సాగుకు ప్రోత్సాహాలు అందాలి

సీజన్‌ ఆధారంగా పంటల సాగు పెరగాలి
హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రస్తుతం కూరగాయల పంటల ఉత్పాదకత ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉడడం వల్లనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సీజన్‌ను పట్టి పంటలు పండించే విధానం వస్తే రైతులకు గిట్టుబాటుతో పాటు వినియోగదారులకు కూరగాయలు అందుబాటులోకి వస్తాయి.
వీటిని పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. దీంతో ఉత్పాదకత పెరిగితే ధరలు తగ్గుతాయి. రైతులు సైతం నగరాలు, పట్టణాల పరిసరాలలో కూరగాయల సాగుకు మొగ్గు చూపడం లేదు. . హరిత గృహాలను కూరగాయల ఉత్పత్తికే వాడాలి. కూరగాయల సాగు అదనపు విస్తీర్ణానికి సహకరించాలి. ప్రభుత్వం అందిస్తున్న బిందు, తుంపర సేద్యపు పద్ధతులను అనుసరించాలి. దీంతో వినియోగదారులకు తక్కువ ధరలకే కూరగాయలు అందుబాటులో ఉంటాయి. రైతులకు సాగు గిట్టుబాటు అవుతుంది.  హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, ఇతర పట్టణాలు, నగరాల పరిసర ప్రాంతంలో ముఖ్యంగా కూరగాయల పంటల కాలనీలు గుర్తించాలి. ప్రధాన కూరగాయ పంటలైన టమాటా, మిరప, బెండ, వంగ, ఆకు కూరలు సాగుకు సవిూప ప్రాంతాలు గుర్తించి సాగుచేసి నేరుగా పంట కాలనీల నుంచి ప్రజల కాలనీలకు చేర్చాలి. ప్రత్యేకించి కూరగాయల ధరల నియంత్రణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం భారీ సబ్సిడీతో హరితగృహాల్లో సాగును ప్రోత్సహిస్తున్నది. గత మూడేళ్లలోనే గ్రీన్‌ హౌజ్‌ల సంఖ్య 1100లకు పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న కూరగాయాలతోనే రాష్ట్ర అవసరాలు తీరుతున్నాయి.
మార్కెట్లో టమాటాలు వంద రూపాయలు పెట్టి కొంటున్న తరుణంలో కనీసం 50 రూపాయలైనా రైతులకు చేరివుంటే బాగుండేది.  ఈ సమయాల్లో పంటలు వచ్చేలా రైతులను ప్రోత్సహించాలి. ప్రస్తుతం అవసరాల్లో టమాటా ఉత్పత్తి 50 శాతం మించి లేదు. కాబట్టి బెంగళూరు, చిత్తూరులోని మదనపల్లి నుంచి వేసవి, జూన్‌, జూలై నెలల్లో దిగుమతి చేసుకొని వాడుకోవాల్సి వస్తోంది. అక్కడా పంటలు తక్కువే కావడంతో ధరలు అమాంతంగా  పెరిగాయి. అయితే ఇటీవలి వర్షాలకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం టమాటా పంట దెబ్బతిన్నది. పర్యవసానంగా ఆ రాష్ట్రాలు కూడా మదనపల్లి మార్కెట్‌పై ఆధారపడ్డాయి. దీంతో మనం ప్రధానంగా టమాటా దిగుమతి చేసుకుంటున్న మదనపల్లి మార్కెట్‌లో టమాటా ధరలు పెరిగాయి. అందుకే రాష్ట్రంలో టమాటా ధరలు భగ్గు మంటున్నాయి. ఇకపోతే అన్‌ సీజన్‌లో వాణిజ్య  పంటలు చేతికి వచ్చేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. మార్చి, ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతల వల్ల టమాటా
నాట్లు ఎక్కువగా ఉండవు. మే నెలలో కొంతమేర ఉంటాయి. రకాలను బట్టి మొదటి కాపు రావటానికి 60 నుంచి 75 రోజులు పడుతుంది.  అప్పటి పంట రావటానికి జూలై చివరి మాసం అవుతుంది. అందుకే జూన్‌,జూలైలో టమాటా ధరలు మండుతాయి. అయితే టమాటా సాగు విస్తీర్ణం ఇప్పటికే ఎక్కువగా ఉన్న అనంతపురం, ముందస్తుగానే నారు నాటిన తెలంగాణ జిల్లాల్లోని ఉత్పత్తులు మరో 15-20 రోజుల్లో అందుబాటులోకి వస్తే ధరలు భారీగా తగ్గుతాయి. టమాటాతో పాటు దాదాపు అన్ని కాయగూరలదీ అదే దారి. ఆలు, మిరప, ఉల్లి దాదాపు అన్నింటిదీ ధరలలో తీవ్ర హెచ్చుతగ్గులున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కూరగాయల పంటల ఉత్పాదకత ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే. వీటిని పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. దీంతో ఉత్పాదకత పెరిగితే ధరలు తగ్గుతాయి. రైతులు సైతం నగరాలు, పట్టణాల పరిసరాలలో కూరగాయల సాగుకు మొగ్గుచూపాలి.  రాష్ట్రంలోని విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల అన్ని వ్యవసాయ, ఉద్యాన పంటలు పండుతాయి. అయితే వర్షాధార సాగు వల్ల వానాకాలంలో అన్ని వ్యవసాయ పంటలు, కూరగాయ పంటల సాగు విస్తీర్ణం ఎక్కువ, ఉత్పత్తి ఎక్కువ. అందువల్ల దాదాపు అన్ని కూరగాయల ధరలు తక్కువే.  తక్కువ విస్తీర్ణంలో సాగు అయినప్పటికీ ఉత్పాదకతతో ధరలు పెరుగవు. ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయలు 4-6 రోజులు పట్టడం, తాజాగా ఉండకపోవటం, రైతు ధర కంటే రెండింతలు ధరలు. రవాణా ఖర్చులు పెరుగుతుండటం వల్ల వినియోగదారులపైనా భారం పడుతుంది. అందువల్ల ప్రతి గ్రామం, మండలం, పట్టణాలు, నగరాల దగ్గరలోని వ్యవసాయ వాతావరణాన్ని అంచనా వేసి ఆయా కూరగాయల పంటలకు అత్యంత అనువైన ప్రాంతాన్ని గుర్తించి సాగు చేయాలి. స్వతహాగానే ఆ ప్రాంతంలో ఆయా పంటలకు అనుకూల వాతావరణం ఉంటుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడ, పీడల సమస్య తక్కువ. కాబట్టి నికర స్థలంలో ఉత్పాదకత పెరుగుతుంది. పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. సవిూపంగానే మార్కెట్‌ ఉంటుంది. కాబట్టి రవా ణా ఖర్చులు తగ్గుతాయి. సవిూపంగానే మార్కెట్‌ ఉంటుంది. కాబట్టి రవాణా ఖర్చులు తక్కువే. తాజాగా ఉండటం వల్ల వినియోగదారులు మేలైన ధరలకే కొంటారు. కాబట్టి ఏ విధంగా చూసినా పంట కాలనీలతో రైతులకు లాభాలు ఉండనున్నాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు భవిష్యత్తుకు అత్యంత అండగా ఉండనున్నాయి.