కూరగాయల సాగుపై రైతుల ఆసక్తి

సబ్సిడీపై నారు సరఫరాచేస్తున్న ప్రభుత్వం

800 ఎకరాల్లో టమాటా సాగుకు రైతుల సన్నాహాలు

జనగామ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ప్రభుత్వ ప్రోత్సాహం,సబ్సిడీలతో పాటు రాబడి పెరనగడంతో రైతులు కూరగాయ పంటలకు ముందుకు వస్తున్నారని జనగామ జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి కేఆర్‌ లత అన్నారు. పందిరి పంటలను ప్రోత్సమించే క్రమంలో భూమి అనుకూలమో కాదో తెలుసుకుని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో రైతులు కూరగాయల నారు తీసుకువెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయామని వారు పలుమార్లు మా దృషికి తీసుకుని వచ్చారు. దీనిని గ్రహించి ప్రభుత్వమే నాణ్యమైన నారు సరఫరా చేస్తుండడం పట్ల రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనగామ,లింగాల ఘనపురం రైతులు హైదరాబాద్‌కు వెళ్లి టమాట నారు తెచ్చున్నా రు. కూరగాయల సాగు పట్ల ఆసక్తి ఉన్న రైతులు స్థానిక ఉద్యాన అధికారినిసంప్రదించాలన్నారు. జనగామ జిల్లాకు సంబంధించి ఈ సారి ప్రయోగాత్మకంగా టమాట, వంకాయ నారు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం టమాట,వంకాయ సహా వివిధ జిల్లాల్లో సాగుకు అనువుగా ఉన్న రకాల కూరగాయల నారు హైదరాబాద్‌ సవిూపంలోని జీడిమెట్లలో సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో సాగుచేస్తోంది. జిల్లాకు సంబంధించి రెండు వందల ఎకరాల్లో సాగుకు అవసరమైన నారు ప్రాథమికంగా సిద్ధం చేసి ఉంచారు. ఒక్కో రైతుకు రెండెకరాలలోపు నారు సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఒక ఎకరాకు ఎనిమిది వేల మొక్కలు సరిపోతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఎకరా నారు ధర రూ. 16,000లుగా నిర్ణయించింది. రైతు ఇంతమొత్తం వ్యయం భరించలేడని ఉద్దేశంతో 90 శాతం సబ్సిడీ అంటే ఇందులో రూ.14,400లు పోను రూ.1,600 లు చెల్లిస్తే సరిపోతుందని నిర్ణయించింది. నాలుగు రకాల విత్తనాలను ఎంపిక చేసి నారు పెంచుతున్నారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖాధికారిని కలిసి డబ్బులు చెల్లిస్తే నారు అందిస్తారు. జిల్లాలో రెండు పంట కాలాల్లో సుమారు ఎనిమిది వందల ఎకరాల్లో టమాట సాగు చేస్తారని జిల్లా అధికారులు అంచనా వేశారు. కూరగాయల సాగులో రాష్ట్రం ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కూరగాయల సాగును ప్రోత్సహించే క్రమంలో సబ్సిడీపై విత్తనాలు అందించింది. అయితే భూ స్వభావం, వర్షాభావం, తదితర పరిస్థితుల వల్ల అనుకున్న దిగుబడి రాలేదు. అన్నదాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం పరిష్కార మార్గం సూచించింది. అదే నేరుగా అన్నదాతలకు కూరగాయల నారు సరఫరా చేసే కార్యక్రమం. రైతులు వరి, పత్తి లాంటి పంటలు వేసి మద్దతు, అతివృష్టి, అనావృష్టి, తదితర సమస్యల వల్ల నష్టపోతున్న ఈ తరుణంలో వారికి కూరగాలయ నారును సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో సాగవుతున్న కూరగాయల విస్తీర్ణం, ఎలాంటి కూరగాయలు సాగవుతాయన్న వివరాలు సేకరించి ఈ యేడాది నుంచి నారు సరఫరాకు శ్రీకారం చుట్టింది.