కృష్ణా డెల్టాకు గోదావరి నీటి విడుదల 

జాపంపేట వద్ద పోలవరం కుడికాల్వకు జలహారతి ఇచ్చిన మంత్రి
జగన్‌ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
ప్రతిపక్షనేత తీరుపై మండిపడ్డ మంత్రి దేవినేని ఉమ
విజయవాడ, జూన్‌19(జ‌నం సాక్షి) : పోలవరం కాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు మూడో ఏడాది గోదావరి నీటిని మంగళవారం మంత్రి దేవినేని ఉమ విడుదల చేశారు. ముందుగా పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడికాల్వకు మంత్రి జలహారతి ఇచ్చారు. అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటి తరలింపు వల్ల రూ.10 వేల కోట్ల పంట ఉత్పత్తి జరుగుతుందన్నారు. జగన్‌ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం అంతు చూస్తానని జగన్‌ తిరుగుతున్నారని అన్నారు. పోలవరం సినిమా చూపిస్తున్నారంటూ జగన్‌ హేళన చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పనుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టామని, ఇప్పటికీ పోలవరంపై రూ.8500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి ఇంకా రూ.1400 కోట్లు రావాలని మంత్రి దేవినేని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుంటే జగన్‌ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా కేంద్రంపై పోరాడే చంద్రబాబును విమర్శింస్తున్నాడని మండిపడ్డాడు. జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర చేసేందుకు ప్రజలు ఇబ్బందులను తెలుసుకొనేందుకు కానీ కేవలం చంద్రబాబును తిట్టడానికే యాత్రను చేపట్టారన్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నారని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. జగన్‌ ప్రతిపక్ష నాయకుడి పాత్రనుపోషించడంలో పూర్తిగా విఫమయ్యాడన్నారు. ఇప్పటికైన ప్రభుత్వ చేపట్టే ప్రజాసంక్షేమ పథకాలపై విమర్శలు మాని కేంద్రం తీరును ఎండగట్టేందుకు ప్రయత్నించాలని  ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ భాస్కర్‌, చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు.