కెటిఆర్‌ చేతుల విూదుగా మెగా వైద్యశిబిరం

జనగామ,నవంబర్‌17(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఈ నెల 18న శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శిబిరాన్ని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి కెటి రామారావు ప్రారంభిస్తారు. నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్‌ ఈనెల 18న వస్తున్నారని చెప్పారు. పేదరికంలో ఉన్న ప్రజలను ఆరోగ్య పరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అసెంబ్లీ స మావేశాల అనంతరం నియోజకవర్గంలో ఎస్సీ సంక్షేమ యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. దళితులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, 3 ఎకరాల భూమి, పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులను అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నదన్నారు. వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని, శిబిరానికి పేదల ను తరలించాలని కోరారు. 34 ఏళ్లుగా పేదలకు వైద్యాన్ని అందిస్తున్నానని, ప్రజా సేవ చేసేందుకు నియోజకవర్గ ప్రజలు రాజకీయంలోకి తీసుకువచ్చారని వివరించారు. ఒకవైపు వైద్యుడిగా, మరో వై పు ప్రజాసేవకుడిగా ముందుకు సాగుతున్న తాను ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలను నిర్వహించి, ఉచితంగా వైద్యాన్ని అందించనున్నట్లు తెలిపారు. అవసరం ఉన్నవారికి ఆపరేషన్లను ఉచితంగా చేయిస్తామని వెల్లడించారు.