కెటిఆర్‌ వ్యాఖ్యలు దేనికి సంకేతం?

సిఎం కెసిఆర్‌ సచివాలయానికి రారు… ప్రగతి భవన్‌లో దర్శనవిూయరు..ఇప్పటి వరకు దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రగతిభవన్‌ అందుబాటులోకి వచ్చాక సచివాలయంలోకి అడుగుపెట్టడం లేదు. పాలన అంతా ప్రగతిభవన్‌ కేంద్రంగా సాగుతోంది. ప్రగతిభవన్‌లో నిర్దిష్ట షెడ్యూల్‌ ప్రకారం ఎవరికైనా అనుమతి ఉండాల్సిందే. అనుమతి లేకుండా నేరుగా కలవడానికి అవకాశం లేదు. చాలామంది రాజకీయ నేతలు తమకు అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని ఆరోపిస్తున్నారు. గడీల రాజ్యం నడుస్తోందిన..సిఎం కెసిఆర్‌ గడీని వదిలి రావడం లేదని తరచూ పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ ఆరోపిస్తున్నారు. మొత్తంగా ప్రగతిభవన్‌ నిర్మాణం మొదలు ఇప్పటి వరకు విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ దశలో సిఎం కూడా పెద్దగా బయటకు రావడం లేదు. పనులుంటే తప్ప వెళ్లడం లేదు. అధికారులు కూడా ప్రగతి భవన్‌కే వెళుతున్నారు. ఈ దశలో తాజాగా తెలంగాణ ఐటి, మునిసిపల్‌ శాఖ మంత్రి, సీఎం కెసీఆర్‌ తనయుడు కెటీఆర్‌ దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం ప్రజలను కలవాల్సిన అవసర మేముందన్నారు. ఇంతపెద్ద వ్యవస్థలో సిఎం నేరుగా ప్రజలతో కలవాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న లేవనెత్తి ప్రజాస్వామ్యంలో చర్చకు తెరలేపారు. నిజాంగా ప్రజాస్వామ్యంలో అధినేత నిరంతరంగా ప్రజలతో మమేకమై ఉండాలి. కానీ కెసిఆర్‌ ప్రగతిభవన్‌ వీడి రాకుండా ఉండడం ఒక ఎత్తయితే కెటిఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యమూలసూత్రాలనే సవాల్‌ చేసేవిగా ఉన్నాయి. సోమవారం నగరంలో ఎంసిఆర్‌ హెచ్‌రా/-/-డి ఐఏఎస్‌లకు అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమంలో మాట్లాడిన కెటిఆర్‌  ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రోజువారీగా ముఖ్యమంత్రి ప్రజలను కలవాల్సిన పనేముందని వ్యాఖ్యానించారు. గత ముఖ్యమంత్రులు చేసినట్లే..ఈ సీఎం కూడా ప్రజాదర్బార్‌ నిర్వహించాలని చాలా మంది అంటున్నారు. ఇది తెలివితక్కువ వ్యవహారం. అనడం ద్వారా సచివాలయం,పరిపాలన వ్యవహారాలను అవహేళన చేశారనే అనుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను నిరంతరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సిఎంగా ఏమూలన ఏం జరుగుతుందో గ్రహించాలి. అధికారులు స్రమంగా పనిచేస్తున్నారా లేదా గ్రహించాలి. అలాంటి వ్యవస్థలో సిఎంకు ప్రజలతో సంబందం ఏమిటని అనడం ద్వారా కెటిఆర్‌ ఓ రకంగాచర్చకు తెరలేపారనే గ్రహించాలి. నిజంగా ఇది కెటిఆర్‌ సొంత వైఖరా లేక టిఆర్‌ఎస్‌ వైఖరా లేక, కెసిఆర్‌ వైఖరా అన్నది కూడా తెలియాలి. కెసిఆర్‌ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. ఆయన ఓ రకంగా చెప్పాలంటే ఆధునిక విప్లవానికి కేంద్రబిందువు. ప్రజలతో నిరంతరం మమేకమై తను పట్టుబట్టిన ఉద్యామాన్ని సాకారాం చేఇన వ్యక్తి. కెసిఆర్‌ ఒక వ్యక్తి కాదు..ఓ విప్లవ వ్యవస్థ.. అలాంటి వ్యక్తికి ప్రజలతో సంబంధం లేదని అనడానికి లేదు. ఒకవేళ కెసిఆర్‌ను ఉద్దేవించి కెటిఆర్‌ అనకున్నా ప్రతి సిఎం నిత్యం ప్రజల్లో ఉండాల్సిన అసవరం ఉంది. ఓ ముఖ్యమంత్రి రోజువారి ప్రాతిపదికన ప్రజలను కలవాల్సిన అవసరం ఏముందనుకుంటే పాలన సాగదు. పాలనలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది.  సీఎంకు ఎంతో పెద్ద పరిపాలనా వ్యవస్థ ఉంది. 31 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో కలెక్టర్లు ఉన్నారు. 564పైగా మండలాలు.. మండల స్థాయి అధికారులు ఉన్నారు. గ్రామస్థాయి పరిపాలన కూడా ఉంది. 29 మంది గ్రామ స్థాయి నిర్వాహకులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది..వారి బాధ్యతలు నిర్వహించటానకి.. ప్రజల అవసరాలు తీర్చటానికి వీరంతా నిరంతరం చూస్తున్నారని అన్నారు. కెటిఆర్‌ ఆలోచన ఆయన కోణంలో సరైనదే అయినా ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి నిరంకుశానికి దారితీయగలదు. ఇలాంటి వైలి సరైనది కాదు. ప్రధాని, సీఎం, మంత్రులు ప్రతి ఐదేండ్లకు ఒకసారి ప్రజల నుంచి ఎన్నికవ్వాల్సిందేనని చెప్పారు. 
కానీ.. ఐఏఎస్‌లు సుదీర్ఘకాలం పనిచేస్తారని పేర్కొన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులపైనే అన్నీ ఆధారపడి ఉంటాయని అందరూ అనుకుంటారని, కానీ ప్రభుత్వాధికారుల మద్దతుతోనే పనులు అవుతాయని కేటీఆర్‌ చెప్పారు. మంత్రులు పనులు త్వరగా కావాలని వారిపై ఒత్తిడి తెస్తారని చెప్తూ, అది.. వీలైన మేరకు ప్రజలకు ఎక్కువ మంచి చేయడానికేనని అన్నారు. ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకుని?లక్షలాది మంది ఉద్యోగులను పెట్టుకుని, వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు, వేల సంఖ్యలో ఉన్నతాధికారులు ఉన్న వ్యవస్థలో  ముఖ్యమంత్రి ప్రజలను కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.  సీఎం చాలా పెద్ద విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతే కానీ ప్రజాదర్బార్‌ లు నిర్వహించటం కాదని అభిప్రాయపడ్డారు.  ప్రజాదర్భార్‌లు నిర్వహించటం కెటిఆర్‌ దృష్టిలో నియంతల పాలన అన్న ధోరణిలో ఉన్నారు. కానీ ప్రజాదర్బార్‌లు నిర్వహించడం వేరు…ప్రజలతో మమేకమై పోవడం వేరు. ప్రజలు జిల్లాల నుంచి అన్నింటికి ముఖ్యమంత్రి దగ్గరకి వస్తే అది విఫల ప్రభుత్వంగా నిలుస్తుందనేది తన అభిప్రాయం అని కెటీఆర్‌ వ్యాఖ్యానించారు. నిజంగా ప్రతి పనికీ అందరూ సిఎం దగ్గరకు వస్తే వ్యవస్థకూడా పనిచేయదు. పాలనా వికేంద్రీకరణ జరిగితే ఇంత సమస్య రాదు. గ్రామస్థాయిలో సమస్యలు సర్పంచ్‌ స్థాయిలోనే పరిస్కారం అయి..వారే వీటిని పైస్థాయి అధికారులకు రెఫర్‌ చేసేలా ఉంటే సమస్యలు రావు. గ్రామంలో చిన్న పని కూడ ఆసచివాలయ స్థాయిలో నిర్ణయం జరిగితే మరి కెటిఆర్‌ చెబుతున్న వ్యవస్థ పనిచేస్తుందా అన్నది గమనించాలి. వ్యవస్థలు నిర్వీర్యం కావడం వేరు..సిఎం ప్రజల్లో ఒకడుగా ఉండడం వేరని గుర్తిస్తే మంచిది.