కేంద్రం రాష్ట్రానికి చేసిందేవిూలేదు

– అమిత్‌షా పచ్చి అబద్దాల కోరు
– 90శాతం హావిూలు నెరవేర్చామంటారా?
– అమిత్‌షా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
– కుట్రలు పన్నడంలో మోదీ, షాది సరైన జోడీ
– కేసీఆర్‌ కూడా ఏపీపై అసూయ, ద్వేషం ప్రదర్శిస్తున్నాడు
– ఏపీ ప్రయోజనాలు నెరవేర్చే పార్టీలకే టీడీపీ మద్దతు
– డబ్బుల కోసమే జగన్‌ లండన్‌ పర్యటనకు వెళ్లారు
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి22(జ‌నంసాక్షి) : ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేవిూ లేదని, కానీ అమిత్‌షా 90శాతం హావిూలు నెరవేర్చామంటూ పచ్చి అబద్దాలుకోరుగా మాట్లాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన టీడీపీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో మోదీ- అమిత్‌ షాలది బ్రహ్మానీడమైన జోడీ అని దుయ్యబట్టారు. అమిత్‌ షా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఏ మాత్రం కనువిప్పు లేకుండా మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. మనల్ని ఇంకా బాధపెట్టాలనే పైశాచికత్వం వారిలో ఉందని, ఇది దుర్మార్గమైన చర్య అని సీఎం అన్నారు. అమిత్‌ షా కాదు అతనో అబద్ధాల షా. 2014కంటే ముందు అమిత్‌ షా ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. గతంలో పనులు చేసి, ప్రజలను మెప్పించే రాజకీయాలు ఉంటే.. ఇప్పుడు బీజేపీ రెచ్చగొట్టి .. బాధపెట్టే రాజకీయాలు తెచ్చిందన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చ జరగాలని, ఏపీకి ప్రత్యేక ¬దా ఇచ్చారా? విశాఖపట్నానికి రైల్వేజోన్‌ ఇచ్చారా?.. కడపలో స్టీల్‌ ఫ్లాంట్‌కు నిధులు ఇచ్చారా?..  కాకినాడలో పెట్రో కాంప్లెక్స్‌ పెట్టారా?.. ఏం చేశారని 90శాతం లెక్క చెబుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకున్నారని, రాష్ట్రంపై నరేంద్ర మోదీ, అమిత్‌షా కక్ష కట్టారు. పగ, ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది కూడా ఆంధప్రదేశ్‌పై అసూయ, ద్వేషం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రధాని, కేసీఆర్‌ ప్రతిపక్ష నేతకు సహకరిస్తున్నారని అన్నారు. ఉగ్రదాడులపై గతంలో గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీ వ్యాఖ్యలనే ప్రస్తావించామని, మోదీ అప్పట్లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై ఏం మాట్లాడారు.. మోదీ అప్పటి మాటలనే నేను మళ్లీ గుర్తు చేశానని చంద్రబాబు అన్నారు. దానిపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేయడం అనవసరం లేదన్నారు. టీడీపీ చేసింది మోసం కాదని, బీజేపీ చేసింది నమ్మకద్రోహమని, మోసాలు, కుట్రలు చేస్తోంది బీజేపీనే అని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. దేశానికి ఎవరు ద్రోహులో, ఎవరు రాజకీయాలకు వాడుకుంటున్నారో ప్రజలే తేలుస్తారని చంద్రబాబు అన్నారు. అపరిష్కృతంగా ఉన్న 18అంశాలపై ఎక్కడికక్కడ నిలదీయాలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. రావాల్సిన లక్ష కోట్ల రూపాయలు వచ్చి ఉంటే ఎంతో ముందుకు పోయేవాళ్లమని సీఎం అన్నారు. దేశంలో మనం కూడా భాగమైనప్పుడు మనమెందుకు బాధ పడాలని సూటిగా ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఎవరు మనకి మద్దతు తెలుపుతారో వారే మనకి మిత్రులుగా ఉంటారని స్పష్టంచేశారు. నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల సవిూక్షలు పూర్తి చేశామని నేతలకు సీఎం తెలిపారు. క్షుణ్ణంగా అధ్యయనం చేసే సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన నేతలకు వివరించారు.
డబ్బుల కోసమే జగన్‌ విదేశీ పర్యటన..
విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  విమర్శలు చేశారు. డబ్బుల కోసమే జగన్‌ లండన్‌ పర్యటనకు వెళ్లారన్నారని ఆరోపించారు. అలాగే హవాలా డబ్బులు తెచ్చేందుకే జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లారని, ఎన్నికల ముందు ఎవరూ విదేశీ పర్యటనకు వెళ్లరని చంద్రబాబు అన్నారు.