కేంద్రరాష్టాల్ర సంబంధాలపై పునర్నర్వించాలి

పన్నుల వాటాలపైనా స్పష్టత కల్పించాలి
కేంద్ర,రాష్ట్ర విధులపైనా సమగ్ర చర్చ చేయాలి
నీతి ఆయోగ్‌ లక్ష్యాలపై మళ్లీ చర్చించాలి
న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  వచ్చే ఏడాది బడ్జెట్‌ సమర్పణకు గాను వచ్చే నెలలో కసరత్తు మొదు కానుంది. ఇటీవలే జిఎస్టీ సమావేశం లక్నోలో జరిగింది. ఇకపోతే కేంద్రరాష్ట్ర సంబంధాలు, నీటి వాడకాలు, పన్నుల విభజన తదితర అంశాలపై నేటికీ స్పష్టత లేదు. కేంద్రం చేసే సాయాన్ని పూర్తిగా దయాదాక్షిణ్యాలతో చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. బిజెపి నేతలు కేంద్రం ఇచ్చిన ప్రతిపైసాను దానంగా ,ఉదారంగా ఇస్తునట్లుగా చేస్తున్న ప్రచారం ఏవగింపు కలిగిస్తోంది. పన్నుల వసూళ్లకు సంబంధించిన దామాషా పద్దతి ఒకటి ఉందన్న విషయం మరచిపోతున్నారు. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రుల సమక్షంలో నీతి ఆయోగ్‌ సమావేశం గతంలో అనేక ఆదర్శాలను ప్రకటించింది. ఏడేళ్ల క్రితం చెప్పిన విధంగా సమస్యల పరిష్కారంలో నీతి ఆయోగ్‌ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. నీతి ఆయోగ్‌ ప్రారంభ దశలో ఆనాడు ప్రధాని చేసిన ఆకర్శక మాటలు
అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడా స్ఫూర్తి కొరవడిరది. రాష్టాల్రను విశ్వాసంలోకి తీసుకుని ముందుకు సాగాలన్న సమాఖ్య స్ఫూర్తిని విస్మరించారు. ఈ ఏడేళ్లలో ఏం చేశామో…ఏం చేయలేదో ఆలోచన చేయాల్సి ఉంది. గతంలో జరిగిన సమావేశాల్లో ఆయా రాష్టాల్ర సమస్యలను నీతి ఆయోగ్‌ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా నిధుల విడుదలలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ఏకరువు పెట్టారు. అయినా స్పందన కానరావడం లేదు. ఈ క్రమంలో అనేకానేక సమస్యలను చర్చించి కఠిన నిర్ణయాలతో ముందుకు సాగాలి. కేంద్ర రాష్టాల్ర మధ్య సత్సంబధాలు పాదుకొల్పేలా కార్యాక్రమాలు ఉండాలి. నీతి ఆయోగ్‌ ప్రారంభించి సమయంలో కనిపించిన స్ఫూర్తి లోపించిందన్న విషయాన్ని ఆయా రాష్టాల్రు ఎప్పికప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నాయి. నీతి ఆయోగ్‌ ఏర్పాటు దశలో ప్రధాని మోడీ ఆనాడు చేసిన ప్రకటనకు భిన్నంగా నీతిఆయోగ్‌ వ్యవహారాలు నడుస్తున్నాయి. సహకార సమాఖ్య సూత్రాలకు అనుగుణం గా మొత్తం దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయా రాష్టాల్రకు తగిన గౌరవం ఇచ్చి వారిని కూడా ఇందులో భాగస్వాములను చేయాల్సి ఉంది. రాష్టాల్రను కలుపుకుని ముందుకు సాగాల్సిన కేంద్రం ఆ దిశగా పనిచేయడం లేదు సరికదా, మళ్లీ పాతపద్దతిలోనే సాగుతోంది. నీతి ఆయోగ్‌ లక్ష్యాలను
విస్మరించారు. జిఎస్టీని సమర్థించిన ఆయా రాష్టాల్ర సిఎంలే ఇప్పుడు దాని బారినుంచి రక్షించాలని కోరుకుంటున్నారు. వివిధ రంగాలపై అది చూపిస్తున్న చెడు ప్రభావాన్ని విశ్లేషించు కోవాల్సిన కేంద్రం ప్రభుత్వం మొడిగా వ్యవహరిస్తోందే తప్ప ప్రజల కోణంలో ఆలోచించడం లేదు. ఆహారధాన్యాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దిగుబడుల ప్రభావం ధరలపై పడుతోంది. ధాన్యం కొనలేమని కేంద్రం చేతులె త్తేస్తోంది. ఎంపిలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్‌ వ్యవస్థ ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం బదులు నానాటికి దిగజారుస్తున్నాయి. ప్రజల డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చవుతున్నది. దానిపై చర్చ సాగడం లేదు. రాజకీయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిందిపోయి దానిని అధికారం కోసం పావుగా వాడుకుంటు న్నారు. రాజకీయాల్లో ఎదుటి పక్షాలను ఢీకొట్టేందుకు తమ తెలివిని ఉపయోగిస్తున్న పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మాత్రం శ్రద్ద చూపడం లేదు. ఇటీవల కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలన్న సుప్రీం సూచనలను పెడచెవిన పెట్టి ముష్టిగా 50వేలు పడేస్తా మని నివేదిక ఇచ్చారు. ఈ దశలో ఇలాంటి ప్రజాస్వామ్యం కొనసాగితే మరో 70 ఏళ్లయినా మన భారత్‌ రాత మారదు. రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల తీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల విలాసాలకు ఖర్చు చేసుకుం టున్నారు. రాజ్యంగం ఏ మేరకు ఎంతవరకు అమలు సాధించామన్నది పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమన్యాయం అందుతుందా అన్నది చూడాలి. నేలవిడిచి సాము చేసే విధంగా దేశీయంగా ఉత్పత్తులపై దృష్టి పెట్టి స్వయం సమృద్ది సాధించకుండా అంతర్జాతీయ వేదికల పై పెట్టుబడు లకు వెంపర్లాడుతున్న విధానం పోవాలి. దేశీయంగా ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని యువతను స్వయం సమృద్దికి సన్నద్దం చేయాలి. వ్యవసాయం, అనుబంధ రంగాలను అభివృద్ది చేస్తే ఈ దేశం ఇతర దేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయగలదు. సింగపూర్‌, మలేషియా తదితర చిన్న దేశాలను ఆదర్శగా తీససుకుని ఆయా రాష్టాల్రు స్వయం సమృద్ది సాధించే ప్రణాళికలతో సాగాల్సిన అవసరాన్ని గుర్తించాలి. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. విద్య విలాసవస్తువుగా మారింది. ఇలాంటి అసమనాతలను రూపుమాపేందుకు పాలకులు చిత్తశుద్దితో కృషి చేయాలి. ఇంతకాలం ఎక్కడ లోపం ఉందో గుర్తించి అవలోకనం చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి.
విద్యావైద్య రంగం ఎందుకు వెనకబడి ఉందో తెలుసుకోవాలి. ఆహారధన్యాలను ఇంకా ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామో ఆలోచన చేయాలి. రాజకీయ దృక్కోణంలో కాకుండా అభివృద్ది కోణంలో పాలన చేయాల్సిన విషయాన్ని పాలకులు వంటబట్టించు కోవాల్సి ఉంది. ఐదేళ్లు అధికారంలోకి రాగానే మరో ఐదేళ్లు గద్దెపై ఉండడ మెలా అన్న ఆలోచన చేయడం వల్లనే భారత్‌ 70 ఏళ్ల తరవాత కూడా ఇంకా దారిద్యం, నిరక్షరాస్యత, వసతుల కొరత, ఆహారధాన్యాల కొరతతో అలమటిస్తోంది. ఇలా దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై నీతి ఆయోగ్‌ª`లో నిర్వచించాలి. చర్చించాలి. కేంద్రం చేయాల్సిన పనులు…రాష్టాల్రు చేయాల్సిన పనులపై స్పష్టత రావాలి. నీతి ఆయోగ్‌ను బలోపేతం చేస్తూ రాష్టాల్రను విశ్వాసంలోకి తీసుకుని ఉమ్మడిగా ముందుకు సాగాల్సి ఉంది.