కేంద్ర పథకాల ప్రచారంతోనే సరి

క్యాడర్‌లో జోష్‌ నింపలేకపోతున్న నేతలు

బిజెపి నేతల పర్యటనలు ఫలించేనా

హైదరాబాద్‌,జూన్‌14(జ‌నం సాక్షి): మా టార్గెట్‌ ఏపీ , తెలంగాణ రాష్ట్రాలే … ఆ పార్టీ నాయకత్వం చెపుతున్నమాట ఇది …గత రెండు నెలల నుండి ,జాతీయ నాయకులూ హైదరాబాద్‌ లో పర్యటించి రాష్ట్ర నేతలకు జోష్‌ నింపుతున్నప్పటికీ ఒకటి రెండు రోజుల తరువాత వారి తీరు మారడం లేదు. మొన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశాలు కూడా పార్టీ కార్యకర్తల్లో ఏ మాత్రం బూస్ట్‌ నింపలేదు… కార్యక్రమాలు మొదలు పెట్టటమే కానీ పార్టీ లో మాత్రం పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటమే కాకుండా …. ప్రతి రాష్ట్రంలో తాము అధికారంలోకి రావటమే ప్రధాన టా/-గ్గం/ట్గా బిజెపి ముందడుగు వేస్తుంది ….. 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తాము ఇప్పుడు తెలంగాణ పై ప్రత్యేక గురి పెడుతున్నామని కేంద్ర మంత్రులు, జాతీయ బీజేపీ నాయకులూ చెబుతున్నమాట ఇది. తెలంగాణలో అధికారం లోకి రావటమే ఉదేశంతో బిజెపి అధినాకత్వం ప్రణాళిక రచిస్తుంది …. అనేక కార్యక్రమాలు నిర్వహానికి రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేస్తుంది ….. ఈ మధ్య కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరి, గత నెల 31 న రవిశంకర్‌ ప్రసాద్‌ పర్యటన, పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న మురళీధర్‌, మోడీ నాలుగేళ్ళ పాలన సందర్భంగా పాల్గొన్న రామ్‌ మాధవ్‌ ఇలా ఎంత మంది రాష్ట్రంలో పాల్గొన్నప్పటికీ కార్యకర్తల్లో జోష్‌ నింపడంలో తెలంగాణ బీజేపీ నేతలు విఫలమవుతున్నారు….అయితే జూన్‌ నుండి తెలంగాణ లో బస్సు యాత్ర చేపడుతామని,ధూమ్‌ ధామ్‌ లు నిర్వహిస్తామని గత ఐదు నెలల నుండి చెబుతున్నారు…: తెలంగాణ లో పాగా వేస్తామని ముందు నుండి చెబుతున్న కేంద్ర నాయకత్వం అంచనాలను రాష్ట్ర నాయకులు అందుకోలేకపోతున్నారు. ఎంత సేపు వారి సొంత నియోజక వర్గాలకు పరిమితమవుతున్నారు తప్ప రాష్ట్రంలో పర్యటించేందుకు నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవడం లేదు … ప్లలె నిద్ర కార్యక్రంలో కూడా ముఖ్యనాయకులు పాల్గొన్న కూడా కనీసం క్యాడర్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించటం లేదు. అమిత్‌ షా పర్యటన కూడా ఇప్పటికి వరకు తేదీలు ప్రకటించినప్పటికి…. బస్సు యాత్ర చేపడుతామని చెప్పిన వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు వీరికి అడ్డంకిగా మారాయని వారి మదిలో ఉన్నట్టు సమాచారం….అయితే పంచాయతీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం అవుతామని చెబుతున్నారు…ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ పలు విడతల బస్సు యాత్రలు చేపట్టారు…కానీ తెలంగాణ బీజేపీ మాత్రం ఎక్కడ స్పష్టమైన ప్రకటన చేయటం లేదు… ఈ మధ్య జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశాలు కూడా తుతు మంత్రంగా ముగిసాయి… ఎలాంటి నిర్ణయాలు కూడా తీసికోలేదని పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తున్నమాట … ఎంత సేపు కేంద్ర పథకాలు పైన ప్రచారం చేస్తున్నారు తప్ప పార్టీ ని రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చెప్పడం లేదని అంటున్నారు…వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కాలం ఉన్న ఇక్కడి నేతలు మాత్రం ఏదో పథకం పేరు చెప్పి నెలలు గడుపుతున్నారని తెలుస్తుంది…. ఇక అమిత్‌ షా కూడా ఇక్కడి నేతల పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది.. నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణ లో అధికారం చే జిక్కించుకోవడానికి మేము విశ్వా ప్రయత్నాలు చేస్తుంటే విూరు మాత్రం ఒకటి రెండు రోజులే గ్రామా పర్యటనలు చేసి ముగించుకుంటారా అని మండిపడ్డారని తెలుస్తోంది…కేంద్ర పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలయ్యారనే వార్తలు వస్తున్నాయి….అంతేకాదు మోడీ పాలనలో ఈ నాలుగేళ్లలో ఏం చేశారో కూడా కార్యకర్తలకు చెప్పలేకపోతున్నారు…ఇక జనాల్లోకి వెళ్తాము వెళ్తాము అంటున్న తెలంగాణ బీజేపీ ప్రజలకుప్రభుత్వ వైఫల్యాలు వివరించరేందుకు ఒక్క కరపత్రం కూడా ప్రింట్‌ చేయకపోగా,ప్రజలకు భరోసా ఇచ్చేందుకు కూడా కార్యాచరణ ప్రకటించడం లేదు….ఏదేమైనా తెలంగాణ లో ప్రత్యామ్నాయం మేమె అంటున్న తెలంగాణ బీజేపీ పార్టీ క్యాడర్‌ ల జోష్‌ నింపలేకపోతుంది…పర్యటనలు కూడా పూర్తిస్థాయిలో చేయక క్యాడర్‌ లోకూడా కొంత అసహనం నెలకొన్నట్టు చేస్తుంది…అయితే నెల వారీగా నిధిష్ట తేదీలు ప్రకటిస్తే తప్ప పార్టీ కార్యకర్తల్లో కొత్తదనం కనిపించేలా లేదు.. అసలు రాబోయే ఎన్నికలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాలి.