కేజ్రీవాల్‌కు ప్రత్యర్థిగా న్యూఢిల్లీ మాజీ మంత్రి

న్యూఢిల్లీ awsyqlfn copyజనం సాక్షి: అత్యంత ప్రతిష్టాత్మక అసెంబ్లీ స్థానమైన న్యూఢిల్లీ పోరులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి కిరణ్‌వాలియాను బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కు గట్టి పోటీనివ్వాలనే ఉద్ధేశ్యంతో కిరణ్‌వాలియా పేరును నిర్ణయించినట్టు సమాచారం. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి కిరణ్ వాలియా పేరును అధిష్టానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

2013 సాధారణ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థి షీలాదీక్షిత్‌పై 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కిరణ్వాలియా అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.