కేటీఆర్‌కు వరల్డ్‌ ఎకనమిక్స్‌ ఫోరం ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: చైనాలోని డాలియన్‌లో జూన్‌ 27 నుంచి 29 వరకు జరిగే వరల్డ్‌ ఎకనమిక్స్‌ ఫోరం వార్షిక సమావేశానికి హాజరుకావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లో స్టార్టప్‌ల ఏర్పాటు, మిషన్‌ భగీరథ, హైస్పీడ్‌ బ్రాడ్‌బాండ్‌ ఇంటర్నెట్‌ సదుపాయానికి తీసుకుంటున్న చర్యలపై ప్రసం గించాలని నిర్వాహకులు మంత్రిని కోరారు.

రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని వివరించారు. కాగా.. ‘ప్రపంచీకరణ భవిష్యత్తు’ అంశంపై ఏప్రిల్‌ 28, 29వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న సదస్సులో పాల్గొనాల్సిందిగా సీఐఐ నుంచి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.