కేటీఆర్‌కు హమాలి సంఘం సంపూర్ణ మద్దతు

వీర్నపల్లి నవంబర్‌ 12 (జనంసాక్షి): కేటీఆర్‌కు హమాలి సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈమేరకు ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో టీఆరెస్‌ మండల అధ్యక్షుడు శ్రీరామ్‌ నాయక్‌ ,ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రాజేష్‌ బాబు ఆధ్వర్యంలో వీర్నపల్లి మండల హమలి కార్మిక సంఘం మండల అద్యక్షులు దేవయ్య వారిసబ్యులూ కెటిరామారావుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్బంగా శ్రీరామ్‌ నాయక్‌ మాట్లాడుతూ టీఆరెస్‌ ప్రభుత్వ రైతు కార్మిక సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి మండల కార్మికులు స్వచ్చందంగా మద్దతు తెలపటం హర్షణీయం అని కొనియాడారు.రానున్న రోజులలో మరింత ఈ ప్రాంత అభివృద్ధి ఒక టీఆరెస్‌ పార్టీ తోనే సాధ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్‌ గ్రామశాఖ అద్యక్షులు గంగదరి రాజు సినీయర్‌ నాయకులు మాడ్గుల మల్లేశం బోడ జగన్‌ హమాలి సంఘ సభ్యులు మోహన్‌ దర్సింగ్‌ శేఖర్‌ రవి రాజు రాకేష్‌ కృష్ణ నగేష్‌ రైతులు యువకులు టీఆరెస్‌ నాయకులు కార్యకర్తలు పాలుగున్నారు.