కేటీఆర్‌ సవాల్‌ను మేమెందుకు స్వీకరించాలి`

\

సమాధానం చెప్పాల్సిన పనిలేదంటూ తప్పించుకున్న కిషన్‌రెడ్డి

` అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తామన్న కేంద్రమంత్రి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేతనైతే ప్రధాని అవినీతి చిట్టాను ప్రజల ముందు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.కల్వకుంట్ల కుటుంబం ముందు భాజపా చేతులు కట్టుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. కేంద్రం, ప్రధానిపై గాలి మాటలు మాట్లాడోద్దని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. భాజపా అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను తెలంగాణ ప్రజా భవన్‌గా మార్చుతామని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు.’’గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పిలిస్తే సమావేశానికి హాజరుకాని సీఎంకి కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదు. గవర్నర్‌పై విమర్శలకు దిగి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దిగజార్చారు. కేటీఆర్‌ సవాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెరాసలో ప్రళయాలు, భూకంపాలు రాకుండా కేసీఆర్‌ చూసుకోవాలి. సీఎం కేసీఆర్‌ తీసుకున్నట్లుగా డైనింగ్‌ టేబుల్‌పై కేంద్రం నిర్ణయాలు తీసుకోదని తెలుసుకోవాలి. మేము అడ్డుకుంటే కేసీఆర్‌ కుటుంబం దిల్లీలో ధర్నా చేయగలిగేదా? తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి భూమి, ఇసుక, లిక్కర్‌, రైస్‌, మైన్స్‌ మాఫియా నడిపిస్తున్నారు. బస్తీ దవాఖానాలు ఎవరివో మంత్రి హరీశ్‌రావు చెప్పాలి. ఈ నెల 29న కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్‌ రానున్నారు. రూ.10వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న రోడ్లకు గడ్కరీ శంకుస్థాపన చేస్తారు’’ అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.