కేశవపట్నం వద్ద రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

ఖమ్మం,మార్చి02(జ‌నంసాక్షి): దుమ్ముగూడెం మండల పరిధిలోని చిన్ననల్లబల్లి, కేశవపట్నం గ్రామాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. చర్ల మండలం తేగాడ గ్రామానికి చెందిన 12 మంది విజయవాడ కనకదుర్గ ఆలయానికి దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న నాగమణి(55), ఆరు నెలల చిన్నారి శ్యాంసుందర్‌ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుమ్ముగూడెం ఎస్సై ప్రసాద్‌ దర్యాప్తు జరుపుతున్నారు.

ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు

కామేపల్లి  మండలంలోని ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని కామేపల్లి పోలీసులు పట్టుకున్నారుపండితాపురానికి చెందిన ఎల్‌.రమేశ్‌ జల్సాలకు అలవాటు పడి డబ్బు సంపాదనకు దొంగతనాలు మార్గంగా ఎంచుకున్నట్లు రూరల్‌ సీఐ డి.రమేశ్‌ తెలిపారు. నిందితుడి నుంచి రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇ/-లలెందు న్యాయస్థానంలో రమేశ్‌ను హాజరుపరచనున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సైలు సంతోష్‌, శ్రీనివాస్‌లు తెలిపారు.

పాముకాటుకు యువతి మృతి

పాముకాటుకు గురై గిరిజన యువతి మృతి చెందిన సంఘటన  వెలేరుపాడు  మండలంలోని కత్కూరు గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కత్కూరు గ్రామానికి చెందిన గురుగుంట్ల మంగరాణి(17) అనే కొండరెడ్డి గిరిజన యువతి ఆదివారం కూలిపనుల కోసం చిగురుమామిడి గ్రామానికి వెళ్లింది. ఈ క్రమంలో మిరప తోటలో కాయలు కోస్తుండగా పాము కాటు వేసింది. దీంతో తోటి కూలీలు ఆమెను స్థానికంగా ఉన్న గ్రావిూణ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అనంతరం మంగరాణి బంధువులు నాటు వైద్యుని వద్దకు తీసుకెళ్లి పసరు మందు వేయించారు. అర్థరాత్రి ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది.

యువరైతు మృతి

పెనుబల్లి మండలం అన్నారుగూడెంలో పులివీరయ్య(25) అనే యువ రైతు బావిలో పడి మృతి చెందాడు. తనకు చెందిన మిర్చితోటలో బావిలో నీరు తోడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడినట్లు స్థానిక రైతులు చెప్పారు.