కేసిఆర్‌ పేదల, రైతుల పక్షపాతి

– మ్యానిపెస్టోతో మరోసారి నిరూపితమైంది
– టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో దేశానికే ఆదర్శం
– కాంగ్రెస్‌ను నమ్మేస్థితిలో ప్రజలు లేరు
– ఆపద్దర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : కేసిఆర్‌ పేదల, రైతుల పక్షపాతి అని మరోసారి మంగళవారం విడుదల చేసిన మ్యానిపెస్టో ద్వారా నిరూపితమైందని ఆపద్దర్మ మంత్రి పోచారం అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు రాగానే అడ్డదిడ్డంగా హావిూలిచ్చి ఓట్లు దండుకునే ఆచారం కొన్ని పార్టీలదని, అందులో కాంగ్రెస్‌ పార్టీ మొదటిదన్నారు. ఇచ్చిన హామిలే కాదు, చెప్పని పనులు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్‌ ప్రవేశ పెట్టి అమలు చేశారన్నారు. వచ్చే అయిదేళ్ళకు లెక్కగట్టి అవగాహనతో పాక్షికంగా మ్యానిపెస్టో విడుదల చేసారన్నారు. లక్ష రూపాయల రుణమాపీ తో పాటు రైతును రాజు చేయాలన్న ఆలొచనతో కెసిఅర్‌ రైతుబంధు సాయాన్ని పది వేలకు పెంచారన్నారు. ప్రపంచంలో నే రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రైతుసమన్వయ సమితిల సభ్యులకు గౌరవ భృతి ఇవ్వాలని నిర్ణయం, పించన్ల సాయం పెంపు, వయోపరిమితి తగ్గింపు ద్వారా ముఖ్యమంత్రి మరోసారి పేదల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. స్థలాలున్న పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ లు మంజూరు చేసే విధంగా టీఅరెస్‌ మ్యానిపెస్టోలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎస్సి ఎస్టీల సంక్షేమం కోసం ఎన్నికల ప్రణాళిక లో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇతర కులాల్లోని పేదల కోసం ఉన్నట్లుగానే వైశ్యులు, రెడ్డి సోదరుల కోసం ఫెడరేషన్‌ ఏర్పాటు.. ఏది ప్రకటిస్తామో దానిని నూటికి నూరు శాతం టిఅరెస్‌ అమలు చేస్తుందన్నారు. కాంగ్రెసువి ఉత్తుత్తి వాగ్దానాలు అని, రెండు లక్షల రుణమాపీ ఇస్తామన్నా ప్రజలు నమ్మరని ఆపద్దర్మ మంత్రి పోచారం అన్నారు. గతంలో వాగ్దానాలు నిలబెట్టుకోలెదని, కాంగ్రెస్‌ లో సరైన నాయకత్వం లేదని పోచారం అన్నారు. టీఅర్‌ఎస్‌ మ్యానిపెస్టో దేశానికే ఆదర్శంగా ఉంటుందన్నారు. ప్రజల ఆమోదం ఉన్న ప్రణాళిక టీఆర్‌ఎస్‌ ది అని, ప్రణాళిక చూశాక ఇతర పార్టీ లు తోకలు ముడవాల్సిందేనన్నారు. కాంగ్రెస్‌ ను ప్రజలు నమ్మే పరిస్తితి లేదని, నిజామాబాద్‌ ఉభయ జిల్లాల్లో తొమ్మిది స్థానాలు టిఆర్‌ఎస్‌ గెల్చుకుంటుందన్నారు. రాష్ట్రంలో వంద సీట్లపైన టిఅరెస్‌ గెల్చుకుంటుందన్నారు.