కేసీఆర్‌ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారు

– నిబంధనలకు విరుద్ధంగా ఆరుగురు ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌ ¬దా ఇచ్చారు
– కోర్టు చెల్లవని తీర్పునిచ్చినా కేసీఆర్‌ ప్రభుత్వానికి లెక్కలేదు
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌, జనవరి25(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి చాలా మందికి కేబినెట్‌ ¬దా ఇచ్చారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ సీఎం.. ఆరుగురు ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇచ్చారన్నారు. ఈ నియామకాలు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆప్‌ ఎమ్మెల్యేల మాదిరిగానే… ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అనర్హులవుతారని, దీనిపై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఈసీకి, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే చెల్లుతుందా? అని రేవంత్‌ ప్రశ్నించారు. దీనిపై గవర్నర్‌ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. పదవికాలంలో ఉన్నప్పుడు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు చెల్లించిన జీతభత్యాలను రికవరీ చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. రసమయి, సోమారపు సత్యనారాయణ, వేముల ప్రశాంత్‌రెడ్డి… నిబంధనలకు విరుద్ధంగా పదవుల్లో ఉన్నారని, ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతానికి లోబడి కేబినెట్‌ సభ్యులు ఉండాలని, లేదంటే మంత్రులను కూడా తొలగించాలని.. దీనిపై కోర్టుకు వెళతామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అంతకు ముందు కాంగ్రెస్‌ నేతలు షబ్చీర్‌ అలీ, రేవంత్‌ రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆరుగురు ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ప్రభుత్వం క్యాబినెట్‌ ¬దా కల్పించిందని, వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు వినతి ద్వారా కోరారు. వారి పదవుల సమయంలో అనుభవించిన మొత్తాన్ని రికవరీ చేయాలని కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ను కోరారు.