కొత్తపంచాయితీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన

ఆదిలాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో 866 గ్రామ పంచాయతీలు ఉండగా.. నాలుగు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 1508కి చేరాయి. కొత్తగా తండాలను పంచాయితీలుగా ప్రకటించడంతో అవికూడా పంచాయితీలుగా ఏర్పడ్డాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 467, నిర్మల్‌ జిల్లాలో 396, మంచిర్యాల జిల్లాలో 311, ఆసిఫాబాద్‌ జిల్లాలో 334 చొప్పున గ్రామ పంచాయతీలున్నాయి. నిర్మల్‌ మున్సిపాల్టీలో రెండు గ్రామ పంచాయతీలు మంజులాపూర్‌, వెంకటాపూర్‌ విలీనం అవుతుండగా.. ఖానాపూర్‌ నగర పంచాయతీగా ఏర్పడింది. ఆదిలాబాద్‌ మున్సిపాల్టీలో రెండు గ్రామ పంచాయతీలు అనుకుంట, రాంపూర్‌ విలీనమవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో హాజీపూర్‌, నస్పూర్‌ గ్రామ పంచాయతీలు విలీనమవుతున్నాయి. ఈ పంచాయతీలకు జూలై 31న పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్తగా ఏర్పడ్డ పంచాయితీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన సాగనుంది.