కొత్త గవర్నర్‌తో ఒరిగేదేమిటో

నేలవిడిచి సాము చేస్తున్న బిజెపి నేతలు

అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఇరు తెలుగు రాష్టాల్ల్రో సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. కేంద్రం పక్షపాత వైఖరితో ఉందన్న విమర్శలు రెండు రాష్టాల్ర నుంచి ఉన్నాయి. ఈ దశలో ఇరు తెలుగు రాష్టాల్ల్రో బిజెపి నేతలు ధైర్యం చేసి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నాలు చేయడం లేదు. కనీసంగా ఢిల్లీ వెళ్లడానికి ధైర్యం చేయడం లేదు. హైకోర్టు విబజన మొదలు వివిధ సంస్థలకు నిధుల కేటాయింపు జరగడం లేదు. తాజాగా తెలంగాణ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి ఢిల్లీలో కేంద్ర వైఖరిని తప్పుపడుతూ తెలంగాణపట్ల వివక్ష కొరనసాగుతోందని అన్నారు. వెంటనే బిజెపి నేతలు విమర్వలు అందుకున్నారు. ఇలా చేయడం కొత్తేవిూ కాదు. తెలుగు రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న వారిపైన మాత్రం విమర్శలు చేస్తున్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నా/-లలో భాగంగా ఇందుకు వారు విమర్శలను ఎత్తుకున్నారు. ఎపిలో తాజాగా గవర్నర్‌ను మార్చాలన్న డిమాండ్‌ తీసుకుని వచ్చారు. మాకు ప్రత్యేకంగా గవర్నర్‌ ఉండాలని కోరుకుంటున్నారు. నిజానికి గవర్నర్‌ వ్యవస్థను ఎత్తేయాలని కోరుకుని ఉంటే అంతా అభినందించేవారు. ఏపీకి చెందిన నేతలు పలువురు టిడిపి, బిజెపి నేతలు గవర్నర్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాట కూడా వాస్తవమే. నిజానికి పరిపాలన అంతా గవర్నర్‌ పేరు విూద సాగినా..పరిపాలనలో ఆయన పాత్ర చాలా పరిమితం. గవర్నర్‌ మార్పు వల్ల రాష్ట్ర ప్రగతి ఏమైనా పరుగులు పెడుతుందా? అంటే అదేవిూ ఉండదు. కాకపోతే తమతో సవ్వంగా ఉండే గవర్నర్లు ఉండాలని ప్రభుత్వాలు కోరుకోవటం సహజమే. కానీ బిజెపి ఎంపీకి, బిజెపి శాసనసభాపక్ష నేతకు గవర్నర్‌ మార్పు..కొత్త వారి నియామకం వల్ల వచ్చే లాభనష్టాలు ఏవిూ ఉండవు. తమ పరిపాలన అంతా ఏపీకి వెళ్లినందున ఏపీలో ఉండేలా తమకు కొత్త గవర్నర్‌ ను నియమించాలని ప్రభుత్వం కోరటంలో తప్పేవిూ లేదు. తాజాగా బిజెపి ఎంపీ, ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఏపీకి కొత్త గవర్నర్‌ ను నియమించాలని కోరుతూ కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ కు లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం ఏపీ బిజెపి శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్‌ రాజు కూడా గవర్నర్‌ నరసింహన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గవర్నర్‌ నరసింహన్‌ నిర్ణయాలు కూడా పలు వివాదస్పదం అయ్యాయి. కానీ బిజెపి నేతలు వరస పెట్టి గవర్నర్‌ ను టార్గెట్‌ చేయటం..ఇప్పుడు ఏకంగా కేంద్ర ¬ం మంత్రికి లేఖ రాయటం వెనక ఆంతర్యం ఏమిటి? దీనివల్ల బిజెపి కోటాలో మరొకరికి గవర్నర్‌ పదవి వచ్చే అవకావం రావచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని పలువురు మంత్రులు గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఏపీపై పక్షపాతం చూపిస్తున్నారనే భావనతో ఉన్నారు. ఇటీవలే తెలంగాణకాంగ్రెస్‌ నేతలు అయితే గవర్నర్‌ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఏ గవర్నర్‌ కూడా నరసింహన్‌ తీరుగా వ్యవహరించలేదు..అదే సమయంలో ప్రతిపక్షాలతో అన్ని విమర్శలు ఎదుర్కోలేదని చెప్పొచ్చు. అయితే ఇవన్నీ కేంద్రానికి తెలియడం లేదా లేకపోతే తెలుసుకోవడం లేదా అన్నది చూడాలి. బిజెపి నేతల లేఖపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదో చూడాలి. అలా స్పందిస్తే హైకోర్టు సహా అనేక అంశాలపైనా స్పందించాల్సి ఉంటుంది.