కోడేరు లో ఘనంగా చాకలి ఐలమ్మ 127వ జయంతి.వేడుకలు.

కోడేరు (జనంసాక్షి) సెప్టెంబర్ 26 కోడేరు మండల కేంద్రంలో బస్టొండ్ చౌరస్తా లోని  అమరవీరుల స్థూపం దగ్గర వీరనారి చాకలి ఐలమ్మ 127 వ జయంతి కార్యక్రమాన్ని రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు దాసరాజుల రవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది.తదనంతరం ఐలమ్మ బర్త్ డే కేక్ ను రజక వృత్తిదారుల సంఘం కోడేరు మండల కార్యదర్శి చర్లపల్లి పెద్ద రాములు మరియు కోశాధికారి చర్లపల్లి చిన్న రాములు బర్త్డే కేకును కట్ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమానికి అతిథులుగా బహుజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆది సోమనాథ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిరాం రెడ్డి, చామంతి రాజు మరియు సింగోటం మాజీ సర్పంచ్ వెంకట స్వామి, బిజెపి నాయకులు  రామకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ నాలుగో వార్డ్ మెంబర్ బాలస్వామి, మరియు మైనార్టీ నాయకులు మక్బుల్, మరియు రజక వృత్తిదారుల సంఘం నాయకురాలు సుజాత, సోప్పరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Attachments area