కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

అభ్యర్థుల ప్రచారంపై బృందాల నిఘా: కలెక్టర్‌

జగిత్యాల,నవంబర్‌15(జ‌నంసాక్షి): రాబోయే అ సెంబ్లీ ఎన్నికలను జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో, నియోజకవర్గస్థాయిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామనీ, ప్రవర్తనా నియామవళి కోసం నియోజకవర్గానికి మూడు బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటితో పాటు ఫ్లయింగ్‌ స్కాడ్‌, వీడి యో వ్యూయింగ్‌

టీంలు ఉంటాయని, ఇవన్ని జిల్లా స్థాయిలో కూడా ఉంటాయన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దన్నారు. ఓటింగ్‌ సమయం నాటికి 48 గంటల వరకు ప్రచారం చేసుకునే వీలు ఉంటుందని, ఆ సమయం దాటిన తర్వాత ప్రచారం చేయరాదన్నారు. ఎన్నికల్లో ఓటర్లను తరలించడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకోరాదనీ, ప్రైవేటు ఆస్తులపై ప్రచారం చేయరాదని, ఒకవేళ చేసిన అ ఇంటి యాజమానిపై ఒప్పంద పత్రం తీసుకోవాలన్నారు. ప్రచారానికి సం బంధించి పాంప్లెట్స్‌, పోస్టర్లపైన ప్రింటింగ్‌ ప్రెస్‌ పేరు, అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌తో పాటు, వాటిని ఎవరూ అచ్చు వేయించారో వారి పేరు కూడా ఉండాలన్నారు.ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను అందరు పాటించాలన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు కుల, మతాల పరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదన్నారు. విమర్శలనేవి పథకాలపై మా త్రమే ఉండాలని, వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేయరాదన్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు తీయడానికి ప్రత్యేకంగా పోలీసులచే అనుమతి తీసుకోవాలన్నారు. ర్యాలీలు ఒకే రహదారి గుండా కావాలని ఇద్దరు, ముగ్గురు దరఖాస్తు చేసుకుంటే అటువంటి వాటికి ప్రత్యేక సమయాలను కేటాయించి, వారికి అనుమతి ఇస్తారన్నారు. డవ్మిూ అభ్యర్థులకు సంబంధించిన వాహనాలను తీసుకుని అభ్యర్థులు ప్రచారం చేయరాదనీ, ఒకవేళ అటువంటి వాహనాలు వాడితే ఐపీసీ సెక్షన్‌ 171 కింద నేరంగా పరిగణించి కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రచారం చేసే సమయం లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు దేవాలయాలు, చర్చీలు, మసీదుల్లో ప్రచారం చేయరాదనీ, ఒక వేళ చేసిన అభ్యర్థులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో డైరీలు, క్యాలెండర్లు, దేవుడి చిత్రపటాలతో ప్రచారం చేయిస్తే నేరం కింద పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ¬ర్డింగ్స్‌ వంటి వాటిని స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకుని పెట్టుకోవాలన్నారు. వివిధ దినపత్రికలు, చానళ్లలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వరాదన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం చేయరాదన్నారు. ప్రచారాలకు సంబంధించి పెయిడ్‌ ఆర్టికల్‌ను పరిశీలిస్తున్నామని అన్నారు.