కౌలురైతును గుర్తించడం అసాధ్యం

– రైతుబంధు పథకం చారిత్రాత్మకం
– దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు 
– చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి కోసమే రైతుబంధు 
– పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లితే అధికారులకు ఫిర్యాదు చేయండి 
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– తిరుమలాయపాలెంలో రైతుబంధు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
ఖమ్మం, మే16(జ‌నం సాక్షి) : రైతుబంధు పథకానికి గ్రామాల్లో అపూర్వ స్పందన వస్తోందని మంత్రి తుమ్మలనాగేశ్వరరావు అన్నారు. బుధవారం తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడులో రైతుబంధు చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌలురైతును గుర్తించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పంటసాయం పొందిన రైతులు కౌలు ధర తగ్గించాలని సూచించారు. పట్టాదారు పాసుబుక్‌ తాకట్టుపెట్టాలని ఏ బ్యాంకైనా అడిగినా.. పాసుపుస్తకంలో తప్పులు దొర్లినా అధికారులకు ఫిర్యాదు చేయాలని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.  రైతులకు మేలు చేయాలని 24 గంటల కరెంట్‌, సాగునీరు, పంట పెట్టుబడి, పండించిన పంటలు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు, ఎరువులు విత్తనాలు యాంత్రీకరణ పరికరాలు ఇలా ప్రతీ ఒక్కటి చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులకు కడుపు మండుతుందన్నారు. రైతులకు మేలు చేస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతులకు ఇచ్చే చెక్కులతో బ్యాంకుల్లో ఒకేసారి వెళ్లకుండా మూడు నెలల్లో ఎప్పుడైనా మార్చుకోవచ్చన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గ్రామాల్లో హహిళలు నేటికీ బిందెలు పట్టుకొని తిరుగుతూ ఉంటే చూసి భరించలేకన ఎంత ఖర్చు అయినా వెనుకడుగు వేయకుండా మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నాల్లానీరు ఇచ్చే విధంగా పనులు పూర్తి చేస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథతో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
ఎవ్వరికీ లంచాలు ఇవ్వద్దు..
పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం ఎళ్ల తరబడి చెప్పులరిగేలా తిరుగినా పనులు కాలేదు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులను విూ ఇళ్లకు పంపి పనులు చేయిస్తున్నది. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టే ప్రజల కష్టాల్లో పాలుపంచుకొంటుందని అన్నారు. ఎవ్వరూ ఎక్కడా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వేళ విూరు ఏ అధికారికైనా ఇస్తే చెప్పండి వెంటనే ఇక్కడే వాటిని ఇప్పిస్తానని మంత్రి తుమ్మల సభలో ప్రజలు అడిగారు. ఈ కార్యక్రమంలో డీఈసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, జడ్పీచైర్మన్‌ కవిత, అధికారులు పాల్గొన్నారు.