క్రీడా సౌకర్యాలు మెరుగు పడాలి 

ఆదిలాబాద్‌,మార్చి5(జ‌నంసాక్షి): జిల్లా క్రీడల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఇందిరాప్రియదర్శి క్రీడా మైదానంలో మరిన్ని సౌకర్యాలు కలిగితేనే ఔత్యాహికులకు అందుబాటులో ఉంటుందని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.  రాత్రివేళల్లోనూ ఆయా ఆటలు ఆడుకునేలా గతంలోనే సోలార్‌
వీధీ దీపాలను ఏర్పాటు చేశారు. యువకుల దేహదారుఢ్యం పెంపునకు ఉపయోగపడే వ్యాయామశాల ఆధునికీకరణకు అవసరమయ్యే పరికరాలను తెప్పించారు. ఆయా పనుల కోసం నిధులను ఖర్చుచేసి  సద్వినియోగం చేసుకున్నారు. అయితే కొన్ని శాఖలు మాత్రం నిధులు ఖర్చు చేయడంలో వెనకంజ వేయడమే గాకుండా పనులలో నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఆయా పనులు పూర్తిచేయాలని చెబుతూనే మరిన్ని నిధులు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా వైద్యం, విద్య, రవాణా, క్రీడలు, భవనాల మరమ్మతులు, ప్రహరీలు వంటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆయా పనులకు నిధులను కేటాయించాలన్నారు. కొంతమంది అధికారులు ప్రత్యేక చొరవ చూపడంతో ఆయా నిధులు సకాలంలో ఖర్చయి సదుపాయాలు సమకూరి, పలు ప్రయోజనాలు కలిగాయి. అందుబాటులో ఉన్న నిధులనే ఖర్చు చేసేందుకే అధికారులు నిర్లక్ష్యం చూపడం జిల్లా ప్రగతిపై వారికి ఏమేరకు చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.