ఖమ్మం జిల్లా స్థానిక మామిళ్లగూడెం శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నందు సస్య భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

 

 

 

 

రఘునాథ పాలెం జనవరి 31 జనం సాక్షి ముఖ్యఅతిథిగా ఏ. ఈ రంజిత్ రెడ్డి( రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ). మాట్లాడుతూ లో భాగంగా పిల్లలకి రైతుల యొక్క కష్టాన్ని వారి యొక్క విలువలను తెలియజేశారు.ఆహారం యొక్క విలువను, అదేవిధంగా భవిష్యత్తులో మనం ఏ విధంగా నడుచుకోవాలో పిల్లలకు తెలియజేశారు. పిల్లలకు చదువు పైన ఆసక్తి కలిగే విధంగా కొన్ని మంచి మాటలు చెప్పారు. అలాగే ఈరోజు చదువును నిర్లక్ష్యం చేయడం వలన రాబోయే కాలాలలో ఎదుర్కొనే సమస్యలను గురించి తెలియపరిచారు. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్,మరియు వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను, మెడల్స్ లను బహుకరించారు.ఈ కార్యక్రమానికి చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీవిద్య డీజీఎం చేతన్ కోఆర్డినేటర్ నాగేందర్ , ఆర్ ఐ. జయ ప్రకాష్, ప్రిన్సిపాల్ నీరజ, ప్రైమరీ ఇంచార్జి ఝాన్సీ, పి పి టి ఇంచార్జి గీత,
సైన్స్ డిపార్ట్మెంట్ అఖిల్ రాజ్, పర్వీన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.