ఖర్చు తగ్గించేలా బడ్జెట్‌ పెళ్లిళ్లు

ఏజెన్సీల ద్వారా తగ్గనున్న ఖర్చు
హైదరాబాద్‌,జ‌నం సాక్షి): వివాహం జరిపించాలంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. ఖర్చు గురించి ఆలోచిస్తేనే గుండెలు గుభేలుమంటాయి. సాధారణ, మధ్యతరగతి కుటుంబాల్లో..అదీ అడపిల్ల తరపు వారైతే పెరుగుతున్న భారంతో మరీ ఇబ్బంది పడుతున్నారు. పెళ్లి తంతు పూర్తి చేయడానికి పెట్టిన ఖర్చుతో నేడు కేవలం కల్యాణ వేదిక కూడా దొరకని పరిస్థితి నగరంలో నెలకొంది. ఇక పెళ్లిళ్లకు భారీగా గార్డెన్ల చుట్టూ తిరిగి ఖర్చు చేయలేని వారు ¬టళ్లను ఆశ్రయిస్తున్నారు. ¬టళ్లవారు కూడా తక్కువ ఖర్చుతో పెళ్లి పందిళ్లు, భోజనం ఏర్పాటు చేస్తున్నారు. వన్‌రూఫ్‌ ప్రోగ్రామ్‌ కింద అన్ని సదుపాయాలను కల్పించడంతో ¬టళ్లలో తక్కువ ఖర్చుతో పెళ్లిల్లు జరిగి పోతున్నాయి.  ఆహారం, దుస్తులు, పందిరి, ఫొటోగ్రాఫర్లు ఇలా ప్రతి అంశంలోనూ వ్యయం అంచనాలు మించుతోంది.అద్దె దుస్తులు అద్దె నగలు ఇప్పుడు పెళ్లిళ్లలో ఇవే బాగా రాణిస్తున్నాయి. అద్దెకు ఖరీదైన  కార్లు కూడా ఇస్తున్నారు. సొంతంగా కొనుక్కునే స్థోమత లేని వారు వీటిని ఉపయోగించుకుంటున్నారు.  పెళ్లిళ్లకు చేస్తున్న ఈ భారీ వ్యయాన్ని అదుపు చేయడానికి చట్టం చేయాలని ఇటీవల పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టే పరిస్థితి వచ్చింది. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో సైతం ఇంతగా ఖర్చు చేయరు. ఈ దశలో భారీగా  ఖర్చులు తగ్గించి ఉన్నంతలో మంచిగా పెళ్లిళ్లు జరిపేలా అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇందులో నగలునట్రా, సామాన్లు, సూట్లుబూట్లు, కార్లు తదితరాలన్నీ అద్దెప్రాతిపదికన అందచేస్తున్నారు. ఒక్క రోజు ధరించే వాటికిపెద్దఎత్తున ఖర్చు పెట్టేకంటే.. వీటిని అద్దెకు తీసుకోవడం ద్వారా ఆదా చేయవచ్చని సూచిస్తున్నారు. పెళ్లికూతురి నగలకు సైతం రూ.లక్షల్లోనే వెచ్చిస్తున్నారు. ఇందులోనూ కొంత మిగల్చవచ్చు. ఇటువంటి సంస్థలతో పాటు కొన్ని ఆన్‌లైన్‌ కంపెనీలు సైతం ఉన్నాయి. ఇప్పటికే దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో ఇవి బాగా ప్రాచర్యం పొందాయి. నగరంలో పెళ్లిళ్లలో కల్యాణ వేదికలకు అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటోంది. ¬టళ్లు, బాంక్వెట్‌ హాళ్ల రుసుము మరింత అధికం. ఎంత ఖర్చయినా కూడా తప్పదు కదా అని కల్యాణ వేదికలనే ఆశ్రయిస్తున్నారు వధూవరుల తల్లిదండ్రులు. ఈ విషయంలోనూ ఖర్చు తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి. నగరంలోని ¬టళ్లలో కంటే సౌకర్యంగా ఉండే శివారు ప్రాంతాల వైపు మొగ్గు చూపితే కొంత తక్కువ ధరకు వేదిక దొరుకుతుంది. ఒక్క వివాహాల సీజన్‌లో, ముఖ్యంగా వారాంతాల్లో ¬టళ్లు, కల్యాణ వేదికల ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవకాశం ఉంటే అంతగా సీజన్‌ కాని సమయాల్లో, పనిదినాల్లో వివాహం పెట్టుకుంటే ఖర్చు తగ్గుతుంది. ఒక నగరంలోని కల్యాణ వేదికల్లో, ¬టళ్లలో నిర్వాహకులతో ఒప్పందం ఉన్న అలంకరణ, లైటింగ్‌ అందించేవారి నుంచే సేవలు పొందాల్సి ఉంటుంది. దీంతో వీరి రుసుము సాధారణం కంటే ఎక్కువే. పైగా మనకు నచ్చినవి ఎంచుకునే అవకాశం తక్కువ. అందుకే ఇటువంటి నిబంధన లేని వాటినే ఎంచుకుంటే మేలు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి చోట్ల వివాహం జరిపించడం ద్వారా వేదికకు పెట్టే ఖర్చుతో అంతకంటే గొప్పగా జరిపించొచ్చు.శుభకార్యంలో అందించిన ఆహారం ద్వారానే అది ఎంత గొప్పగా జరిపారో చెప్పుకుంటారనే భావన ఉంది. ఉన్నతవర్గాల వారైతే ఏకంగా విదేశీ ఆహారం కూడా వడ్డిస్తుంటారు. ఇందుకు డబ్బు ప్లేట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కూడా తక్కువ మెనూతో రుచికరమైన ఆహారం అందించడం ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా ప్రొఫెషనల్‌ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ కంటే చిన్న స్టూడియోల్లోని ఫొటోగ్రాఫర్లు, ఫ్రీలాన్సర్లు తక్కువ ధర తీసుకుంటారు. పెళ్లి పందిరి అలంకరణ కోసం విదేశీ పూలంటూ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వీటి స్థానంలో దేశీయ పూలతోనే మరింత అందంగా పందిరి రూపొందించే వారు చాలామందే ఉన్నారు. పెళ్లి పత్రికలను స్థోమతను బట్టి భారీ వ్యయంతోనే రూపొందిస్తున్నారు. దీనికి బదులు ఫోన్లు చేయడం, ఆహ్వాన వీడియో పంపడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. మొత్తంగా ఖర్చు తగ్గించి పెళ్లి చేయాలనుకునే వారికి మార్కెటింగ్‌ ఏజెన్సీల తోడ్పాటును అందిస్తున్నాయి. మన బడ్జెట్‌ను బట్టి పెళ్లిళ్లు చేసేలా సలహాలు ఇస్తారు.