గద్వాలలో అరుణమ్మకు ఓటమి తప్పదు

కెసిఆర్‌ మాత్రమే అభివృద్ది చేయగల నాయకుడు:టిఆర్‌ఎస్‌
గద్వాల,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): గద్వాలలో ఈ సారి డికె అరుణకు ఓటమి తప్పదని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. నిరంతరం విూ మధ్య ఉండి, విూ సేవకే అంకితమైన వారికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..పథకాల అమలులో నాలుగేళ్లలో సీఎం కేసిఆర్‌ చరిత్ర సృష్టించారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం లాంఛనమేనని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికలంటే ఎన్నికలు అన్నట్టుగా జరుగుతున్నాయని.. నియోజకవర్గంలోని ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ పక్షాన నిలుస్తుందని వ్యాఖ్యానించారు. డికె అరుణపై విమర్శలు సముచితమేనని అన్నారు. ఆమె వల్ల ఈ ప్రాంతానికి ఒరిగిందేవిూ లేదన్నారు. పాలమూరు పచ్చబడాలంటే కెసిఆర్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. ప్రతిపక్షాలకు ఓటమి తెలిసిపోయిందని కేవలం ఉనికి కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఎద్ధేవా చేశారు. తెలంగాణ ఆడబిడ్డల పండుగైన బతుకమ్మకు సారేగా సీఎం కేసీఆర్‌ చీరలను అందిస్తుంటే, ప్రతిపక్ష నాయకులు రాద్దాంతం చేస్తు పంపిణి అడ్డుపడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని, మహిళలు వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు, రెండో విడుత చెక్కులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పా ట్లు చేయగా, ప్రతిపక్ష పార్టీలు కోర్టుకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల్లో మహాకూటమికి ఓటమిపాలయ్యేలా ప్రజలు షాక్‌ ఇవ్వాలని  అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కాలంలో సీఎం కేసిఆర్‌ ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని నిరుపేదల అభివృద్ధి, రైతుల సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా పని చేయడం జరుగుతుందన్నారు.