గద్వాలలో సిఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రులు

ఏర్పాట్లపై అధికారులతో సవిూక్ష
మంత్రి హరీష్‌ సమక్షంలో పలువురు టిఆర్‌ఎస్‌లో చేరిక
జోగులాంబ గద్వాల,జూన్‌26(జ‌నం సాక్షి): ఈ నెల 29న సీఎం కేసీఆర్‌ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ సభ ఏర్పాట్లు చురకుగా సాగుతున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో గద్వాలలోని కొండపల్లిరోడ్‌లో గల సంబరాల మైదానంలో జరిగే బహిరంగ సభా స్థలాన్ని మంత్రులు హరీశ్‌రావు, సి. లక్ష్మారెడ్డి పరిశీలించారు. అధఙకారులతో కలసి సవిూక్షించారు. అదేవిధంగా గట్టు మండలం పెంచికలపాడు దగ్గర పైలాన్‌ నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మంద జగన్నాథం, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, గద్వాల టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో  టీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పి ఆయా పార్టీల నేతలను మంత్రి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అడ్డాకుల మండల కేంద్రంలోని కొత్తకోట వైస్‌ ఎంపీపీ
బాలరాజుతో పాటు కొత్తకోట 1 వ ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, తెలుగు యువత అధ్యక్షుడు సత్యం యాదవ్‌ టీఆర్‌ఎస్‌ లో చేరారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ చూపిన బాటలో పనిచేస్తామని పార్టీలో చేరిన వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.