గద్వాల ఆస్తత్రి స్థాయి పెంపు

వంద నుంచి 300కు పెంచుతే ఉత్తర్వులు

హైదరాబాద్‌,జూలై19(గద్వాల ఆస్తత్రి స్థాయి పెంపు): జోగులాంబ జిల్లాలోని గద్వాల ప్రాంతీయ ఆస్పత్రి స్థాయిని వంద పడకల నుంచి 300ల పడకలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంద మాతాశిశు ఆస్పత్రి పడకలతో కలిపి 300ల పడకల ఆస్పత్రిగా మార్చనున్నారు. రూ. 43.75 కోట్ల వ్యయంతో ఆస్పత్రి స్థాయిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనిపై ఎప్పటి నుంచో పలువురు నేతలు స్థాయి పెంచాలని కోరుతున్నారు. ఇక జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్యానవన నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. ఉద్యానవనం కోసం రూ. 15 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 29న గద్వాలలో సీఎం కేసీఆర్‌ పర్యటించిన సందర్భంగా.. జూరాల ప్రాజెక్టు వద్ద రూ. 15 కోట్లతో బృందావన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేస్తామని, గద్వాల ఆస్పత్రి స్థాయి పెంచుతామని సీఎం హావిూ ఇచ్చిన విషయం తెలిసిందే.