గాందీ మార్గంలో తెలంగాణలో కెసిఆర్‌ అడుగులు

గ్రామస్వరాజ్యం దిశగా కార్యక్రమాలు

నివాళి అర్పించిన మంత్రులు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అహింసే ఆయుధంగా మలుచుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, జోగురామన్నలు అన్నారు. గాందీ అడుగుజాడల్లోనే సిఎం కెసిఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని నడిపి సాకారం చేశారని అన్నారు. ఆదిలాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలవేసిన జోగురామన్న నివాళి అర్పించారు. తెలంగాణలో సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో గ్రామస్వరాజ్యం సిద్ధించిందన్నారు. కెసిఆర్‌ గాందీ భాటలోనే తెలంగాణ సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని స్థానిక పార్కులో మహాత్ముని విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీజీ కళలు కన్న స్వరాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ ప్రభుత్వం పయనిస్తోందని పేర్కొన్నారు. శాంతి, అహింస, ప్రేమ ఆయన నినాదాలు అన్నారు. నేటి యువత గాంధీ మార్గంలో నడిచి భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ రైతులు, స్త్రీలు, వెనుకబడిన వర్గాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, జిల్లా రైతు సమన్వయ సమతి అధ్యక్షులు నల్లా వెంకట్రామి రెడ్డి, నిర్మల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ధర్మాజీ రాజేదంర్‌, తదితరులు పాల్గొన్నారు.