గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

636051300434764006నేతలు, పోలీసుల మధ్య తోపులాట
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతలు ఛలో  మల్లన్న సాగర్ కు పిలుపునివ్వడంతో మంగళవారం ఉదయం గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు తోపులాట జరగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. మరో వైపు ఛలో మల్లన్నసాగర్ పిలుపుతో  మెదక్ జిల్లాలో పోలీసులు 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 144వ సెక్షన్ విధించారు. కాంగ్రెస్ నేతలు మల్లన్నసాగర్ చేరకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. గాంధీభవన్ నుంచి నేతలెవరిని బయటకు రానివ్వకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత గా ఉంది
కాగా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా గాంధీ భవన్ లో భేటీ అయ్యారు. ఛలో  మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని డీసీపీ కమలాసన్ రెడ్డి తో నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఈ భేటీ లో జానారెడ్డి, ఉత్తమ్, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.