గాలి బీభత్సం: కూలిన 400 ఏళ్ల మర్రిచెట్టు

హోరు గాలికి 400 ఏళ్లనాటి మర్రిచెట్టు కుప్పకూలింది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మన్‌మర్రి గ్రామంలో శుక్రవారం జరిగింది ఈ ఘటన. గ్రామానికి అప్పట్లో ఈ మర్రి చెట్టు కారణంగానే మన్‌మర్రి అని పేరు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. గ్రామం నడిమధ్యలో ఎత్తుగా ఉండి ఊడలమర్రిని తలపించేది. పచ్చదనంతో ఎప్పుడూ ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించే ఈ చెట్టు ఒక్కసారిగా వీచిన పెనుగాలికి వేర్లతో సహా పడిపోయింది. దీంతో మర్రిచెట్టు కింద పార్క్‌ చేసిన రెండు బైకులు దెబ్బతిన్నాయి.