గిట్టుబాటు ధరలు కావాలంటే మార్కెట్‌లోనే అమ్ముకోవాలి

సంగారెడ్డి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరను అందించేందుకు గాను మద్దతు ధరలను నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు 48
గంటల్లోగా డబ్బులను వారి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని అధికారులు సూచించారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జోగిపేట మార్కెట్‌ పరిధిలో గతంలో కంటే ఈసారి ఎక్కువగా వరి ధాన్యం
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దళారీ వ్యవస్థను అరికట్టేం దుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.