గిరజన సంక్షేమం కోసం పక్కా ప్రణాళికలు: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి)  : రాష్ట్రంలోని గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందతున్నాయని మహబూబాబాద్‌ ఎమ్యెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులనుకేవలం ఓటు బ్యాంకుగానే భావించాయని, సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. సీఎంకుగిరిజనులు రుణపడి ఉంటారని అన్నారు. సీఎం కేసీఆర్‌ బృహత్తరమైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని కొనియాడారు. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్‌ లేని తండాలు, గూడేలను గుర్తించి అక్కడి ప్రజలకు రూ.125కే విద్యుత్‌ కనెక్షన్లు అందించనున్నారని, 50 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేయనున్నారని చెప్పారు. రాష్ట్రంలోని గిరిజనుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించారని వెల్లడించారు. తండాల్లో రోడ్లు, విద్య, వైద్యం, ఉ పాధి, అటవీ భూములకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలను అందించనున్నారని వెల్లడించారు. ఆయా కార్యక్రమాల కోసం నివేదికలను అందించేందుకు ప్రత్యేక కమిటీని నియమించారని హర్షం వ్య క్తం చేశారు. గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, రోడ్లు, విద్యుత్‌ తదితర అంశాలపై సమగ్రంగా సర్వే చేసి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాలోని తండాలు, గూడేల్లో రహదారుల నిర్మాణం కోసం నిధులను విడుదల చేశారని, వెల్లడించారు.