గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఏజెన్సీ ప్రాంతాలలలో ఏర్పాటు చేస్తున్న మాడల్‌ పాఠశాలల్లోగిరిజన ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిన పీఆర్సీని నగదురూపంలో ఉపాధ్యాయుల ఖాతాలలో జమ చేయాలన్నారు. జివో మేరకు గిరిజన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని విడనాడి వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి

పాత పెన్షన్‌ను అమలు చేయాలని టీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ఖాళీగాఉన్న మండల విద్యాధికారులు, ఇతరత్ర పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం, సామాజిక మార్పు లక్ష్యాలుగా తమసంఘం పనిచేస్తోందని అన్నారు.