గుండ్లకమ్మ ఎత్తిపోతలకు శ్రీకారం

ఒంగోలు,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో గుండ్లకమ్మ నది విూద నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని జిల్లా ఎమ్మెల్సీ కరణం బలరాం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడంతో ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. రైతులు రాజకీయాలకు అతీతంగా ఎత్తిపోతల పథకాలను సమర్థవంతంగా నిర్వహించుకోవాలని, తిమ్మాయపాలెం, రామాయపాలెం, కొటికలపూడి గ్రామ రైతులు గుండ్లకమ్మపై నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎత్తిపోతల పథకాలకు అడిగిన వెంటనే సిఎం చంద్రబాబు నిధులు మంజూరు చేయడంతో ఈ పనులు త్వరతిగతిన పూర్తయ్యాయన్నారు. జిల్లాలో దాదాపుగా నూట పదమూడు ఎత్తిపోతల పథకాలు మరమ్మతులు చేసి రైతులు పంటలు పండించుకుంటున్నారని ఎమ్మెల్సీ బలరాం పేర్కొన్నారు.