గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ

డబుల్‌ ఇళ్లతో మారనున్న రాష్ట్రం

అర్హులందరికీ గూడు కల్పించడమే కెసిఆర్‌ లక్ష్యం

ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

మహబూబాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రం దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే బాణోత్‌ శంకర్‌ నాయక్‌ అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు తెలంగాణలో ఓ విప్లవమని అన్నారు. వీటితో పేదలకు గూడు కల్పించిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు.

మహబూబాబాద్‌ జిల్లాలోని నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో రూ. కోటి 26 లక్షల నిధులతో నిర్మించ తలపెట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు ఎమ్మెల్యే బాణోత్‌ శంకర్‌ నాయక్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు కట్టిస్తామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ రైతాంగానికి భరోసా ఇస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. రైతు బంధు, మిషన్‌ కాకతీయ, సాగునీరు, 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తూ ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తున్నదని తెలిపారు. దళారులతో రైతులు మోసపోతు న్నారని గుర్తించిన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుందన్నారు.రైతు బీమా వంటి ఓ బృహాత్తర కార్యక్రమాని రూపొందించిన సీఎం కేసీఆర్‌ రైతు కుటుంబాలలో వెలుగులు నింపాడన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బాలాజీ, జెడ్పిటీసీ మేకపోతుల శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, ఎంపీటీసీ పెరుమాండ్ల గట్టయ్య, నెల్లికుదురు మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్‌ రెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.